ఐటమ్ గర్ల్ గా మారిన 'ఇషా'

Isha Chawla turned as Item girl

04:58 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Isha Chawla turned as Item girl

'ప్రేమకావాలి' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ ఇషా చావ్లా. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ కి అవకాశాలు మెండుగానే వచ్చాయి. ఇషా ఆ తరువాత సునీల్ సరసన 'పూల రంగడు' చిత్రంలో నటించి మరో హిట్ అందుకుంది. అయితే ఆ తరువాత బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించి ఫ్లాప్ అందుకుంది. ఆ తరువాత మిస్టర్ పెళ్లికొడుకు, జంప్ జిలాని వంటి వరుస ఫ్లాప్స్ చవి చూసిన ఇషా రెండు సంవత్సరాలుగా తెలుగు తెరకు దూరమయింది. అయితే తాజాగా తన లక్ ని పరీక్షించుకోవడానికి ఐటమ్ గర్ల్ గా మారింది.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న సుప్రీమ్ చిత్రంలో ఇషా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది. ఈ సాంగ్తోనైనా తనకి మంచి బ్రేక్ వస్తుందని ఇషా ఆశిస్తుంది. ఈ చిత్రంలో మెగా హీరో సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

English summary

Isha Chawla turned as Item girl. Isha is doing item song in Supreme movie. Sai Dharam Tej and Rashi Khanna is romancing in this movie.