నారా రోహిత్‌ తో రొమాన్స్‌ చేస్తున్న ఐడియా గర్ల్!!

Isha Talwar romancing with Nara Rohit

05:43 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Isha Talwar romancing with Nara Rohit

'సోలో' చిత్రంతో మంచి హిట్‌ అందుకుని ఆ తరువాత వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయిన కథనాయకుడు నారా రోహిత్‌. వైవిద్యభరిత కధలను ఎంచుకుంటూ సీనీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు ఒక పొందాడు. ఇప్పుడున్న టాలీవుడ్‌ కథానాయకుల్లో నారా రోహిత్‌ ఉన్నంత బిజీగా ఎవరూ లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నారా రోహిత్‌ ఏకంగా ఇప్పుడు తన ఖాతాలో పది సినిమాలు చేర్చుకున్నాడు. ఒక్కొక్క చిత్రానికి వైవిధ్యం చూపిస్తూ పది కధలను ఎంచుకున్నాడు. అందులో ఒక చిత్రమే 'రాజా చెయ్యి వేస్తే'.

ఈ చిత్రంలో నారా రోహిత్‌ సరసన ముంబై భామని ఎంపిక చేశారు. గుండె జారి ఘల్లంతయ్యిందే, మైనే ప్యార్‌ కియా చిత్రాల్లో నటించి, ఇప్పడు ఐడియా ఇంటెర్నెట్‌ షేరింగ్‌ అంటూ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నా ఇషాతల్వార్‌ను ఎంచుకున్నారు. తెలుగులో రెండు చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు ఈ బ్యూటీకి. ఇప్పుడు మూడో చిత్రంలో నటించబోతుంది ఈ చిత్రమైన ఇషాకి క్రేజ్‌ సంపాదించి పెడుతుందేమో చూడాలి. 'రాజా చెయ్యి వేస్తే' లో నందమూరి తారకరత్న విలన్‌ గా నటిస్తున్నాడు.

English summary

Isha Talwar romancing with Nara Rohit in Raja Cheyyi Vesthe movie.