మరో హీరో బ్రదర్ వచ్చేస్తున్నాడోచ్

Ishan Khattar giving bollywood entry

12:48 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Ishan Khattar giving bollywood entry

అటు బాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్ కానీ ఎక్కడైనా సరే హీరోల వారసులు సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక హీరోల తమ్ముళ్లు వారసులుగా తెరంగేట్రం చేయడం షరా మామూలే అయింది. బాలీవుడ్ లో మరో హీరో తమ్ముడు ఎంట్రీ ఇస్తున్నాడు. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. ఇషాన్ తెరంగేట్రం చేయనున్నట్టు ఇటీవల వచ్చిన వార్తలను షాహిద్ తల్లి నీలిమా అజీమ్ ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించింది. తన రెండో కొడుకు కూడా హీరో అవుతున్నాడని, షాహిద్ మాదిరిగా ఇషాన్ కూడా మంచి డాన్సర్ అని చెప్పింది.

ఇషాన్, శ్రీదేవి ముద్దుల తనయ జాహ్నవి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ లతో కరణ్ జోహార్ ఓ సినిమా తీయనున్నట్టు ఇటీవల కథనాలు వినిపించినా, ఇషాన్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయం అవుతాడా లేదా అన్న విషయం నిర్ధారణ కాలేదు.

English summary

Ishan Khattar giving bollywood entry