బాల్‌తో హెల్మెట్‌ని కొట్టమన్న ఇషాంత్‌ శర్మ

Ishanth Arguing with Srilanka Batsman

03:07 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Ishanth Arguing with Srilanka Batsman

శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లతో ఇషాంత్‌ శర్మ గొడవ పడిన విషయం తెలిసిందే. అందుకు ఇషాంత్‌ శర్మపై ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడకూడదని నిషేధం విధించారు కూడా. ఆరోజు జరిగిన విషయాన్ని ఇషాంత్‌ ఇప్పుడు వివరించాడు. నా బౌలింగ్‌లో దమ్మిక ప్రసాద్‌ చేతికి బంతి తగిలింది. కాబట్టి నేను బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నన్ను బాల్‌తో కొట్టాలని చూశాడు. ఒకే ఓవర్‌లో బౌలర్‌ రెండు బౌన్సర్లు మాత్రమే వేయాలి, అయితే ప్రసాద్‌ నోబాల్‌ అవుతుందని తెలిసే మూడోది వేశాకడు. అయితే నీ బౌన్సర్ల వల్ల నాకేమీ ఇబ్బంది లేదు, నీ బౌలింగ్‌లో కూడా అంత పస లేదు కావాలంటే నా హెల్మెట్‌పై విసరడం నీ వల్ల కాదు అన్నాను. అప్పుడు మిగతా ఆటగాళ్లు చేరడంతో గొడవ పెద్దదైంది అని వివరించాడు.

English summary

Ishanth Arguing with Srilanka Batsman