ఆగ్రహంతో ఊగిపొయిన ఐష్

Ishwarya Rai Gets Angry On Media

01:05 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Ishwarya Rai Gets Angry On Media

ఎప్పుడూ చిరునవ్వుతూ కనిపించే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మీడియాపై ఒంటి కాలిపై లేచింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో పాకిస్తాన్ షాక్ అయ్యింది. ఈ వ్యవహారం గ్రేట్ సోషల్ మీడియాలో రావడం తో ఇక కామెంట్లే , కామెంట్లు. ఇంతకీ ఐష్ సీరియస్ ఎందుకయ్యిందంటే , ఈ మధ్యకాలంలో షూటింగ్‌లకు కూతురు ఆరాధ్యను కూడా తీసుకెళ్తోంది. కరణ్ జోహార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘యే దిల్ హై ముష్కిల్‌' షూటింగ్ లో పాల్గొని, షూట్ తర్వాత కూతురుతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఐష్ రెడీ అయింది. తన కారులో ఎక్కుతుండగా, తల్లీ- కూతుళ్లను తమ కెమెరాల్లో ఫోటోగ్రాఫర్లు, కెమెరామన్లు బంధించేందుకు ఎగబడ్డారు. వారి నుండి తప్పించుకోడానికి ఐశ్వర్య వేగంగా కదలడంతో, ఆరాధ్యకు కారు డోర్ తగిలేసింది. లేత నాజూకు పసి పిల్ల ఏమో, చిన్నపాటి గాయం కూడా అయ్యింది. ఇంకేముంది, ఆరాధ్య ఏడుపు లక్కించుకుంది. దీంతో ఆ తల్లి మనస్సు చివుక్కుమంది. పాప ఏడుపు చూడలేక ఇలా జరగడానికి మీడియావాళ్లే కారణమంటూ ఐశ్వర్యరాయ్ ఆగ్రహంతో ఊగిపోయింది. చెడా మడా నాలుగు అనేసింది. అదండీ సంగతి...

English summary

Bollywood Top heroine Ishwarya Rai fires on media members for hurting her daughter.Recently Ishwarya rai was acting in karan johar's movie.During that movie shooting media members came near to her along with ishwarya rai to take photos and then ishwarya rai move forward very fastly then her daughter Aradhya bachan gets hurted and then she fires on media members.