ఆ ఉగ్రవాదిని కట్టేసి... బుల్ డోజర్ లో పడేసి...(వీడియో)

ISIS executioner harassed by soldiers

11:22 AM ON 4th June, 2016 By Mirchi Vilas

ISIS executioner harassed by soldiers

సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోవడంతో, ఉగ్రవాదుల పని పట్టేందుకు సిరియా సైనిక దళాలు నడుం బిగించాయి. ఐసిస్ లో ఛోపింగ్ కమిటీ అనే దళ నాయకుడిగా చెలామణి అవుతున్న భారీ జిహాదీని పట్టుకుని అతని చేతులను వెనక్కి విరిచి కట్టి... బుల్ డోజర్ వెనుకభాగంలో పడేసి తీసుకుపోయారు. ఉగ్రవాదుల్లో పరమ కిరాతకునిగా భావిస్తున్న ఇతగాడి పట్టివేతను స్థానికులు ఆసక్తిగా చూశారు. సిరియా, ఇరాక్ దేశాల్లో ఐసిస్ టెర్రరిస్టుల కదలికల పై భద్రతా దళాలు నిఘా పెంచుతున్నాయి.

తమ బందీలను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్న జిహాదీలు ఇటీవలి కాలంలో అమాయక ప్రజల పై పన్నుల భారం మోపి వారిని వేధిస్తున్న తీరును గమనించిన ఇరాక్, సిరియా ప్రభుత్వాలు ఉగ్రవాదులను అణచివేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. మరి, ఇకనైనా ఉగ్రవాదుల కిరాతక చర్యలు ఆగుతాయా, మరింత రెచ్చిపోతారా...

English summary

ISIS executioner harassed by soldiers