బ్యాంకులు కొల్లగొట్టి..

ISIS Gets Money By Thefting In Banks

05:12 PM ON 11th December, 2015 By Mirchi Vilas

ISIS Gets Money By Thefting In Banks

ఐఎస్ఐఎస్.. ప్రపంచ వ్యాప్తంగా నరమేధానికి కారణమవుతున్న ఉగ్రవాద సంస్థ. ఆ సంస్థ సాగిస్తున్న మారణ హోమానికి నిధులు ఎలా సమకూరుతున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే. దీనికి యూఎస్ ఉన్నతాధికారి ఒకరు దిమ్మతిరిగే సమాధానం చెపుతున్నారు. యూఎస్ టెర్రరిజం, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ అండర్ సెక్రటరీ అడమ్ జుబిన్ గురువారం లండన్ లో మాట్లాడుతూ... ఐఎస్ బ్యాంకులను లూటీ చేసి బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిందని వెల్లడించారు. అలాగే నల్ల బజారులో చమురును విక్రయించి ఆర బిలియన్ డాలర్లు మేర ఆ సంస్థ కూడబెట్టినట్లు పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతాల ప్రజలు, వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇలా ఐఎస్ఐఎస్ 1.5 బిలియన్ డాలర్లకుపైగా సమకూర్చుకుందని తెలిపారు.

English summary

An US official says that ISIS terrorists were getting money by thefting the banks and selling petrol in black market