ఆడాళ్ళు అలాంటి దుస్తులు ధరిస్తే, మగాళ్ళు గెడ్డం గీసుకుంటే ...

ISIS imposes new taxes For Shaving Beard And Wearing Tight Clothes

01:42 PM ON 30th May, 2016 By Mirchi Vilas

ISIS imposes new taxes For Shaving Beard And Wearing Tight Clothes

అమెరికా సైనిక దళాల వరుస దాడులతో ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు ఆదాయ వనరుల కోసం కొత్త గా పెనాల్టీలు విధిస్తున్నారు. వాళ్ల ఆధీనంలోని ప్రాంతాలు, చమురు క్షేత్రాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ఈ తరహా పెనాల్టీలు విధిస్తున్నారు. పురుషులు గడ్డం చేసుకుంటే 100 డాలర్ల జరిమానా. మహిళలు బిగుతైన వస్త్రాలు ధరిస్తే 25 డాలర్ల పెనాల్టీ కట్టాలట. ఐఎస్ ఉగ్రవాదుల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పై వేస్తున్న పన్నుల భారం ఇది. ఇరాక్, సిరియాలోని తమ పాలిత ప్రాంతాల ప్రజల పై ఆరు నెలల నుంచి పన్నులను భారీగా పెంచేశారు. కొత్త పన్నులు విధించారు. పురుషులు గడ్డాన్ని పూర్తిగా తొలగిస్తే 100 డాలర్లు, ట్రిమ్మింగ్ చేస్తే 50 డాలర్ల జరిమానా చెల్లించాలంటున్నారు. పురుషులు సాంప్రదాయకమైన పొడవైన, వదులైన దుస్తులు ధరించకుంటే 5 డాలర్లు ఫైన్ కట్టాలి. మహిళలు శరీర భాగాలు కనిపించే విధంగా బిగుతైన దుస్తులు ధరిస్తే 25 డాలర్లు, కళ్లు కనబడేట్లు ధరిస్తే 10 డాలర్లు లేదా ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు సాక్సులు లేదా గ్లోవ్స్ ధరించకుండా బయటికెళ్తే 30 డాలర్లు చెల్లించాల్సిందే.

సిగరెట్ల ప్యాకెట్ పురుషుల వద్ద లభిస్తే 46 డాలర్లు, మహిళల వద్ద లభిస్తే 23 డాలర్ల జరిమానా కట్టాల్సి ఉంటుంది. చెక్ పాయింట్ల వద్ద నుంచి వెళ్లే ట్రక్కులు ఇక నుంచి 600-700 డాలర్ల పన్ను కట్టాలి. గతంలో ఇది 300 డాలర్లు మాత్రమే ఉండేది. ఇరాక్, సిరియా ప్రభుత్వాల్లో గతంలో పనిచేసిన భద్రతా సిబ్బంది, ఉద్యోగులు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సర్టిఫికేట్ పొందాలంటే తగిన రుసుము చెల్లించాల్సిందే. సున్నీ తెగకు చెందని ముస్లింల నుంచి జిజియా పన్నును సైతం ఉగ్రవాదులు వసూలు చేస్తున్నారు. అయినా ఐఎస్ ఆధీనంలోని పరిధి తగ్గిపోవడంతో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 23 శాతం తగ్గింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉగ్రవాదులు విధించే శారీరక శిక్షను డబ్బులు చెల్లించడం ద్వారా తప్పించుకోవచ్చు. అంతేకాదు.. ఐఎస్ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల పై దాడులు చేసి అపహరించిన మహిళలను, యువతులను సెక్స్ బానిసలుగా చేసుకున్నారు. ఇప్పుడు తిండి, వైద్యం ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో సెక్స్ బానిసలను ఫేస్బుక్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇటీవల 18 ఏళ్ల ఇద్దరు యువతులను ఓ ఉగ్రవాది ఫేస్బుక్లో 8 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. ముఖ్యంగా ముస్లిమేతరులు, యజీదీ మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకోవడం, ఒక ఉగ్రవాది మరో ఉగ్రవాదికి విక్రయించడం నిత్యకృత్యంగా మారింది. ఒక్కో మహిళను వారి డిమాండ్ను బట్టి ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు. అయితే వీళ్ల ఫొటోలను ఫేస్బుక్ యాజమాన్యం ఎప్పటికప్పుడు తొలగించేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు అమెరికా ఆధీనంలోని ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:టాయ్‌లెట్‌కు వెళ్తే, పురుషాంగం పై కాటేసిన పైథాన్

ఇవి కూడా చదవండి:కండోమ్ మింగేసిన 25 ఏళ్ళ అమ్మాయి.. ఎందుకో తెలుసా?

English summary

ISIS Terrorists imposes new taxes for Sahving Bears ,Wearing Tight Clothes etc. ISIS imposes when man shaved beard then he have to pay 100 dollars and when woman wears tight clothes then she have to pay 520 dollars as fine.