బతికుండగానే సమాధి చేసేసారట

ISIS Kills 45 Terrorists Alive

10:08 AM ON 12th May, 2016 By Mirchi Vilas

ISIS Kills 45 Terrorists Alive

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌స్టేట్‌ ఆగడాలు రోజు రోజుకు ఇంకా పెరిగిపోతూనే వున్నాయి. ఇన్నాళ్ళూ సామాన్యపౌరులు, ప్రభుత్వదళాలపై ఉగ్రదాడులు జరిపిన ఆ సంస్థ తాజాగా తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను బతికుండగానే సమాధి చేసింది. ఇరాక్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధీనంలో వున్న మోసూల్‌ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కిర్కుక్‌ ప్రాంతంలో కుర్ధుల దళాలతో పోరాడుతూ 45 మంది ఉగ్రవాదులు పారిపోయారు. దీంతో ఆగ్రహించిన ఇస్లామిక్‌స్టేట్‌ నాయకత్వం వీరిని బతికుండగానే పూడ్చిపెట్టాలని ఆదేశించింది. దీంతో వీరు ప్రాణాలతో వుండగానే గుంత తవ్వి పూడ్చేశారు. రెండు రోజుల క్రితం సిరియాలోని అల్‌రకాలో ఒక స్వలింగ సంపర్కుడిని భవనంపై నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ ఘాతుకాలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడోనని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

ఇవి కూడా చదవండి: స్నేక్‌గ్యాంగ్‌కు జీవిత ఖైదు

English summary

ISIS Terrorists killed their own fighters alive . They have buried 45 of their own terrorists. They have killed their own terrorists because the terrorists over run without fighting with the troops.