మహిళా విలేకరిని చంపేసిన ఐఎస్

ISIS Kills woman journalist

06:18 PM ON 6th January, 2016 By Mirchi Vilas

ISIS Kills woman journalist

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల హత్యాకాండ కొనసాగుతోంది. తాజాగా రక్కా ప్రాంతంలో జర్నలిస్టుగా పనిచేస్తూ.. స్థానిక విషయాలను ప్రపంచానికి వెల్లడిస్తున్న ఓ మహిళను ఐఎస్ ఉగ్రవాదులు అమానుషంగా ఉరి తీసింది. ఐఎస్ చంపేసిన తొలి రుఖియా హసన్ అని, ఈ మరణంతో గత అక్టోబర్ నుంచి ఐఎస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన విలేకరుల సంఖ్య ఐదుకు చేరిందని సిరియన్ జర్నలిస్టు సంస్థ సిరియా డైరెక్ట్‌ తెలిపింది. ఐఎస్ అధీనంలో ఉన్న రక్కా ప్రాంతంలో మానవ దైనందిన జీవితం గురించి రుఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం పేరుతో ఫేస్‌బుక్‌లో నిత్యం వార్తలు అందించేది. స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమెను ఉరితీయడాన్ని సిరియా మానవ హక్కుల సంస్థ ధ్రువీకరించింది. 'నేను రక్కాలో ఉన్నాను. నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఐఎస్ నన్ను అరెస్టుచేసి చేసి చంపేయవచ్చు. అయినా ఫర్వాలేదు. ఐఎస్ అవమానాల మధ్య జీవించడం కంటే హుందాగా చనిపోవడం మేలు' అని ఆమె చివరి వ్యాక్యాలను ఆర్బీఎస్‌ఎస్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది.

English summary

An independent woman journalist was executed by Islamic State for reporting from inside their territory, Syrian media reported on Monday.