ఫేస్‌బుక్‌లో ఐఎస్‌ ప్రతిజ్ఞ పోస్టు చేసాడు

Isis Pledge Posted on facebook

12:15 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Isis Pledge Posted on facebook

గురువారం నాడు అమెరికాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 14మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడులను తిప్పి కొట్టిన భద్రతా సిబ్బంది ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరి తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో పోలీసులకు ఆశ్చర్యకమైన నిజాలు బయటపడుతున్నాయిట. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మాలిక్‌ అనే మహిళ, ఆమె భర్త సయ్యద్‌ఫారూఖ్‌ శాన్‌బెర్నార్డినో ప్రాంతంలో కాల్పులు జన సామాన్యంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో దొరికన ఆధారాలను పరిశీలించిన పోలీసులకు పాడైపోయిన రెండు సెల్‌ఫోన్‌లు దొరికాయి. ఈ సెల్‌ఫోన్‌లలో డేటాను పరిశీలించిన విచారణ అధికారులు వాటి ద్వారా ఫేస్‌బుక్‌లో ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ) ప్రతిజ్ఞను పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. గురువారం 11గంటలకు కాల్పులు ప్రారంభం అయినట్లు వార్తలు రాగా, 11.15 నిముషాలకు సదరు ఫోన్ల ద్వారా ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ చేసారట. అంటే కాల్పులు జరుగుతుండగానే దుండగులు ఫేస్‌బుక్‌లో గర్వంగా తమ ఉగ్రవాద సంస్థ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారన్న మాట. అయితే ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌ సంస్థ వెంటనే గుర్తించి, ఫేస్‌బుక్‌నుండి శాశ్వతంగా తొలగించింది. అంతేకాకుండా సదరు ఉగ్రవాది ప్రొఫైల్‌ను కూడా తొలగించింది. ఫేస్‌బుక్‌ యొక్క నియమనిబంధనల ప్రకారం ఉగ్రవాదాన్ని ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫాంపై ప్రచారం చేయడం విరుద్ధం. ఇలా ఫేస్‌బుక్‌ ఉగ్రవాదానికి సంబంధించిన ఒక పోస్ట్‌ను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. సోషల్‌మీడియా సైట్లు ఫేస్‌బుక్‌, ట్విట్టర్లకు ఐఎస్‌లాంటి ఉగ్రవాద సంస్థల ప్రచారం బెడద ఎక్కువగా ఉంది. వీటిని నివారించేందుకు సదరు సంస్థలు కొత్త కొత్త టెక్నాలజీలను కనిపెట్టాల్సి వస్తుందట.

English summary

The terrorist attack in which almost 174 people were died in San Bernardino in america. Police gets information about that attack and poklice satys that news to media