నోబెల్‌ నామినేషన్స్‌లో రేప్ విక్టిమ్

ISIS Rape Victim Nominated For Noble Prize

11:40 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

 ISIS Rape Victim Nominated For Noble Prize

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నోబెల్‌ బహుమతి అందిస్తారని తెలిసిందే. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి 200 నామినేషన్లు అందగా .. వారిలో ఒక అత్యాచార బాధితురాలు కూడా ఉంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులచే అత్యాచారానికి గురై.. తీవ్ర చిత్ర హింసలను ఎదుర్కొని.. చివరికి వారి నుంచి తప్పించుకొని బయటపడ్డ వ్యక్తి నదియా మురద్‌. ఆమె పేరును నార్వే ప్రజాప్రతినిధి అదున్‌ లిస్కాబాకెన్‌ ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేశారు. నదియాకి నోబెల్‌ శాంతి బహుమతిని ఇచ్చి.. లైగింక హింసకి వ్యతిరేకంగా ప్రపంచం యుద్ధం చేసేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ నామినేషన్లలో పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా ఉన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ ఈ నామినేషన్లను పరిశీలించి ఫ్రిబవరి 29న నోబెల్‌ గ్రహీతల పేర్లను ప్రకటించనుంది.

English summary

An ISIS Rape Victim was nominated to Noble Prize by Norwegian Nobel Committee.Norwegian lawmaker Audun Lysbakken nominated Nadia Murad, a Yazidi who escaped from Islamic State sexual slavery to become a spokeswoman for those abused by ISIS terrorists.