అమ్మాయిలను అమ్మేస్తున్నారు.

ISIS Selling Woman For Money

01:24 PM ON 16th December, 2015 By Mirchi Vilas

ISIS Selling Woman For Money

రోజురోజుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఐరాస వారు విడుదల చేసిన విరవాల ప్రకారం ఐఎస్‌ సంస్థ ఆడవారిని మార్కెట్‌లో సరుకు లాగా అమ్మేస్తున్నారని చెప్పింది.

ఇరాక్‌ లోని యాజీదీ తెగ లోని మహిళలను ఐఎస్‌ వారు బలవంతంగా తీసుకువెళ్ళారు. యాజీదీ తెగకు చెందిన ప్రతి ఆడవారిని తీసుకువెళ్ళి తమ ఆధీనంలో బందించారు.

బాలికలు, యువతుల పై ఐఎస్‌ తీవ్రవాదులు అత్యాచారాలు చేసి, అనంతరం వారిని కేవలం సిగరెట్‌ ప్యాకెట్లకు, పది డాలర్ల సొమ్ముకోసం అమ్మివేస్తున్నట్లు ఐరాస వారు తెలిపారు. ఇలా అమ్మాయిలను కొనుగోలు చేసిన వారు వారిని సెక్స్‌ బానిసలుగా మార్చి వేస్తున్నారని తెలిపారు.

ఇలా వేలాది మంది అమ్మాయిలను, యువతులను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి అమ్మేస్తున్నారని , కొందరు యువతులు పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటుంటే, మరి కొందరి తల్లితండ్రులు ఉగ్రవాదులకు డబ్బు చెల్లించి బందీలుగా ఉన్న వారిని విడిపించుకుంటున్నారు. చాలామంది యువతులను ఉగ్రవాదులు చంపివేసారని, ఇంకా ఎంత మంది బందీలుగా ఉన్నారో చెప్పడం కష్టమని ఐక్యరాజ్య సమితి వర్గాలు తెలిపారు.

English summary

According To United nations educational, scientific and cultural organization(UNESCO) report ISIS terroist group were kidnapping woman and selling them for money