రష్యన్ హెలికాప్టర్ ఐసిస్ కూల్చేసింది (వీడియో)

ISIS Shoots Russian Helicopter Near Palmyra

10:51 AM ON 11th July, 2016 By Mirchi Vilas

ISIS Shoots Russian Helicopter Near Palmyra

మొన్న టర్కీ , నిన్న బంగ్లాదేశ్, ఇప్పుడు రష్యా ... ఐసిస్ ఉగ్రవాదుల చేసిన మరో ఘాతుకం ఇది. సిరియాలో తమకు పట్టున్న పాల్మిరా ప్రాంతంలో ఎగురుతున్న రష్యన్ హెలికాప్టర్ ని శనివారం కూల్చి వేశారు. ఈ ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరు పైలట్లు మరణించారు. తమ దుశ్చర్యను ఉగ్రవాదులు వీడియోకి కూడా ఎక్కించారు. ఈ కాప్టర్ మరో విమానాన్ని ఢీ కొనబోతూ రెప్పపాటులో తప్పించుకోగా అదే సమయమని ఐసిస్ ముష్కరులు అమెరికన్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టం తో దాన్ని గురి చూసి పేల్చి..కూల్చేశారు.

అమెరికాలో తయారైన విధ్వంసక ఆయుధాలు, మిసైల్ సిస్టంలను వీళ్ళు తమ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించు కున్నారట పరిస్థితి ఎంత దారుణంగా వుందో చెప్పక్కర్లేదు. వీరి దాడుల్లో తమ పైలట్లు ఇద్దరు మృతి చెందారని రష్యా రక్షణ విభాగం ధృవీకరించింది. ఉగ్ర దాడులకు అడ్డుకట్ట పడేది ఎప్పుడో.

ఇవి కూడా చదవండి:షూటర్ ని కాల్చి చంపిన రోబో

ఇవి కూడా చదవండి:ఒలింపిక్స్ కు 9 మిలియన్ కండోమ్స్ రెడీ

English summary

Russia announced that they were also going to fight against ISIS Terrorists and recently ISIS Terrorists have been shooted a Russia Helicopter Near Palmyra with a missile.They also kept the video in internet.