హైదరాబాద్ లో ఐసిస్ జాడలు - నల్గురు అరెస్టు

ISIS Terrorists Arrested In Hyderabad

11:19 AM ON 29th June, 2016 By Mirchi Vilas

ISIS Terrorists Arrested In Hyderabad

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఐసిస్ ఉగ్రవాదుల గురించే చర్చ సాగుతుంటే ఇప్పుడు హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు ఐసిస్ ఉగ్రవాదులు కుట్ర పన్నారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల విచారణలో తేల్చడం కలకం రేపింది. దీంతో బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ పాత బస్తీలో జరిపిన సోదాల్ల్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అంతేకాదు వీరినుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్న వీరు నాలుగు నెలలుగా ఇక్కడే ఉన్నారని, తమ దాడులకోసం కొన్ని చోట్ల రెక్కీ నిర్వహించారని తెలిసింది.

చాంద్రాయణగుట్ట, హుస్సేనిఆలం వంటి ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఈ నలుగుర్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే నిక్కీ జోసెఫ్ అనే ఉగ్రవాద సానుభూతిపరుడిని, మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..ఈ నలుగురి బాగోతం కూడా బయటపడింది. దీంతో నగరంలో ఐసిస్ నెట్ వర్క్ సీక్రెట్ గా పని చేస్తోందని భావిస్తున్నారు. మొత్తం మీద హైద్రాబాద్ లో ఉగ్రజాడలు కలకలం రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి:మనిషికి ఏడు జన్మలు నిజమేనా?

ఇవి కూడా చదవండి:టర్కీలో ఉగ్ర దాడి - 50 మంది మృతి

English summary

ISIS linked terrorists have been arrested in Hyderabad by the police in a search and Police said that they were planned to attack in some places of Hyderabad and Police have recovered Duplicate money, Bombs and etc from them.