దానికి ఒప్పుకోలేదని ఇనుప బోన్ల లో బంధించి 19 మంది బాలికల సజీవ దహనం

ISIS Terrorists Burned 19 Yazidi Girls Alive For Refusing To Be Sex Slaves

12:42 PM ON 7th June, 2016 By Mirchi Vilas

ISIS Terrorists Burned 19 Yazidi Girls Alive For Refusing To Be Sex Slaves

అసలే అరాచకాలు, మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరి పోయాయి. దీనికి తోడు ఉగ్రవాదులు కూడా మహిళలనే లైంగికంగా హింసిస్తున్నారు. ఇక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కిరాతకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇరాక్, సిరియాల్లో వీరు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. సెక్స్ బానిసలుగా ఉండేందుకు అంగీకరించలేదని 19 మంది యాజిదీ బాలికలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సజీవ దహనం చేశారని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. మోసుల్ నగరంలో అందరూ చూస్తుండగానే బాలికలను ఇనుప బోన్లలో బంధించి తగులబెట్టారు. సెక్స్ బానిసలుగా ఉండనందుకు శిక్షగా వారిని అతి దారుణంగా చంపేశారని మీడియాకు చెందిన వ్యక్తి చెప్పినట్లు ఏఆర్ ఏ న్యూస్ వెల్లడించింది.

19 మంది బాలికలను వందలాది మంది చూస్తుండగా సజీవ దహనం చేస్తుంటే ఒక్కరు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. 2014 ఆగస్టులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ లోని సింజార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సుమారు 3వేల మంది మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకున్నారు. ఇరాకీ కుర్దిస్థాన్ నుంచి దాదాపు 4 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల నుంచి 1800 మంది యాజిదీ మహిళలను అపహరించినట్లు కుర్దిస్థాన్ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చూడండి:హుందాగా రేప్ చేసాడు.. దర్జాగా ఆమె శీలాన్ని డబ్బుతో కొనేసాడు!

ఇవి కూడా చూడండి:అమలాపురంలో ఉద్రిక్తత - స్టేషన్ ఎదుట ముద్రగడ భైఠాయింపు

English summary

Islamic State Terrorists were burned 19 girls alive by hanging then in Iron cage for not accepting to be sex slaves for them. No body were tried to stop this. This was said by one of the witnessed people to media.