ఆ పని చేయలేదని 250 మంది అమ్మాయిలను నరికేశారు

ISIS Terrorists Killed 250 Woman For Refusing To Become Slaves

06:26 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

ISIS Terrorists Killed 250 Woman For Refusing To Become Slaves

ప్రపంచ వ్యాప్తంగా బాంబు పేళ్ళుళ్ళు , దారుణాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన . ఐసిస్ ఉగ్రవాదుల వద్ద లైంగిక బానిసలుగా ఉండడానికి ఒప్పుకోలేదని కోపంతో ఉత్తర ఇరాక్‌లో ఏకంగా 250 మంది మహిళలు, బాలికలను ఐసిస్ ఉగ్రవాదులు అందరు చూస్తుండగానే దారుణంగా నరికి చంపేశారు. ఇరాక్, సిరియా వంటి దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఆక్రమించుకుంటున్న నేపధ్యంలో ఐసిస్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి . తాజాగా 250 మంది యువతులను నిలబెట్టి నరికి చంపిన ఘటన వెలుగు చూసింది . ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బలవంతంగా తీసుకు వచ్చిన యువతులకు ఐసిస్ తీవ్రవాద సంస్థ పెద్దలు ఐసిస్ తీవ్రవాదులను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని, వారికి సెక్స్ బానిసలుగా పని చేయాలని హుక్కుం జారి చేసారు .

ఇవి కూడా చదవండి: కారు నడుపుతూ ఆ..పని కానిచ్చాడు..యాక్సిడెంట్ చేసాడు (వీడియో)

అయితే ఐసిస్ పెద్దలు చెప్పిన విధంగా చెయ్యడానికి ఆ యువతులు ఒప్పుకోకపోవడంతో ఆ 250 మంది యువతులను వారి కుటుంబ సభ్యుల ముందే అతి కిరాతకంగా వారి తలలు నరికి చంపారు . ఈ విషయాన్ని కుర్దిష్ డెమొక్రాటిక్ పార్టీ అధికార ప్రతినిధి సయద్ మముజి తెలిపారు . ఐసిస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని అయన అన్నారు. ఇంతకు ముందు 2014లో కుడా యాజిది తెగకూ చెందిన 500 మంది మహిళలను , బాలికలను అపహరించిన వారి పై లైంగిక దాడికి పాల్పడిన ఉగ్రవాదులు , అదే ఏడాది అక్టోబర్ నెలలో మరో 500 మంది మహిళలను, బాలికలను అపహరించారు.

ఇవి కూడా చదవండి:

కారులోనే స్వయంగా పురుడు పోసుకున్న మహిళ(వీడియో)

విద్యార్ధులతో సెక్స్ చేసి కోరికలు తీర్చుకున్న టీచర్

మనిషిని కరిచి నురగలు కక్కుకుని చనిపోయిన కుక్క

English summary

Islamic State Terrorists have been killed 250 woman for refusing to become sex slaves in North Iraq Area. This was said by Kurdish Democratic Party Leader Sayed Mamooji. In Past also ISIS Terrorists Kidnapped 500 woman .