చిన్నారిని కిరాతకంగా హతమార్చిన ఐసిస్‌

ISIS Terrorists Killed 4 Year Boy

03:54 PM ON 7th January, 2016 By Mirchi Vilas

ISIS Terrorists Killed 4 Year Boy

నరరూప రాక్షసులుగా మారి , ఎడా పెడా దాడులకు తెగబడుతున్న, ఐసిస్‌ ఉగ్రవాదులు అభం శుభం తెలియని చిన్నారులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఐ సిస్ ఉగ్రవాదులు తాజాగా మరో నాలుగేళ్ల చిన్నారిని బలిగొన్నారు. ఇరాక్‌ లో బాంబులతో పేల్చి అతి కిరాతకంగా చంపేసిన ఈ విషాద ఘటన కు సంబంధించి వివరాల్లోకి వెళితే,

ఇరాక్‌లోని అల్‌-షిర్కత్‌ జిల్లాలో ఇసా డేర్‌ అనే నాలుగేళ్ల బాలుడి దేహానికి పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్‌ కంట్రోల్‌తో పేల్చేశారు. అంతేకాదు ఈ సంఘటనకు వారంరోజుల క్రితమే ఆ బాలుడి తండ్రి ని కూడా పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులకి వ్యతిరేకంగా పోరాడి వారిని హతమార్చాడనే ఆరోపణతో ఆ చిన్నారి తండ్రినీ ఇంతే దారుణంగా హతమార్చారు. అది చూసిన ఇసా బ్రిటన్‌లో ఉన్న తాతకు ఫోన్‌ చేసి తనని ఈ ముష్కరుల బారి నుంచి ఎలాగైనా కాపాడమని వేడుకున్నాడట పాపం. అయితేనేం ఉగ్రవాదులు ఇప్పుడు పిల్లాడిని దారణంగా చంపేసి, తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు.

English summary

Islamic state terrorists killed a four year old boy by fixing belt bomb to him in iraq