రెబల్ స్టార్ దర్శించిన ఆలయానికి ఉగ్రవాద ముప్పు

ISIS Threat To Malaysia

10:38 AM ON 1st September, 2016 By Mirchi Vilas

ISIS Threat To Malaysia

మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా హిందూ ఆలయాలు ఎన్నో వున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర వుంది. అదేవిధంగా మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని బాతు కేవ్స్ పేరు చెప్పగానే అక్కడి ప్రఖ్యాత హిందూ దేవాలయమైన కుమారస్వామి (మురుగన్) ఆలయం గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బిల్లా'లో కీలక పాత్ర పోషించిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈ ఆలయాన్ని సందర్శించిన ఘట్టం కూడా ఆ మూవీలో ఉంది.

తెలుగుతో పాటు ఇతర భాషల వారు కూడా మలేషియాలో జరిపే ప్రతీ సినిమా షూటంగ్ లో ఈ ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఆలయంతో పాటు దేశంలోని పలు ఎంటర్టైన్మెంట్ పరికరాల విక్రయ సంస్థలు, పోలీసు స్టేషన్లపై దాడులకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను అత్యంత చాకచక్యంగా మలేషియా పోలీసులు భగ్నం చేశారు. పేల్చిపేతకు కుట్రపన్నిన ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను మలేసియాలో అరెస్టు చేశారు. బుధవారంనాడు మలేసియా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు వ్యూహరచన చేశారు.

భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సందడి చేయనున్న నేపథ్యంలో ఈ దాడులు చేయాలని ఐసిస్ కుట్ర చేసినట్లు మలేసియా పోలీసులు గుర్తించారు. దీంతో ఉగ్రవాద నిరోధక ప్రత్యేక శాఖ పోలీసులు రంగంలోకి దిగి ఈనెల 27, 29 తేదీల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి ఇంటరాగేషన్ లో ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నిన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఖలిద్ అబు బకర్ వెల్లడించారు. దాడికి కుట్ర చేసిన ముగ్గురు 20 నుంచి 30 ఏళ్లలోపు మధ్యవారే కావడం విశేషం.

మొదటి అనుమానితుడిని సెలంగూర్ లో అదుపులోనికి తీసుకుని అతని వద్ద నుంచి గ్రనేడ్, పిస్తోల్, 9 ఎంఎం బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరినీ పహాంగ్ లో అరెస్టు చేశారు. ఈ దాడుల ఆపరేషన్ సమర్థంగా పూర్తి చేసిన వెంటనే సిరియాకు వెళ్లిపోవాలని వారు ప్రణాళికలు రచించుకున్నారని పోలీసు అధికారుల విచారణలో బయటపడింది. కుట్రదారుల నుంచి గ్రనేడ్లు, తుపాకులు, 24 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు లారీ డ్రైవర్ కాగా, మరొకరు కసాయి పని, మూడో వ్యక్తి పానీయాల విక్రేతగా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:జుట్టుకు రంగేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఇది చదవండి..

ఇవి కూడా చదవండి:'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

ISIS terrorists tried to make bomb attacks in Malaysia on the occasion Independence Day Of Malaysia. Malaysia Police Arrested Three Terrorists and recovered Pistols and Grenade bombs from them.