సిరియాలో ఐఎస్ నరమేథం

Isis truck-bomb attacks in Syria

06:22 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Isis truck-bomb attacks in Syria

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ సిరియాలో నరమేథానికి పాల్పడింది. హస్కా ప్రావిన్స్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ట్రక్కు బాంబులు పేల్చింది. ఈ ఘటనలో 60 మందికిపైగా మరణించారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు కుర్దిష్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. హస్కా పట్టణంలోని ఆసుపత్రి, మార్కెట్ వద్ద శుక్రవారం ఈ దాడులు జరగగా... మరోకటి గురువారం ఆర్థరాత్రి టెల్ టమర్ పట్టణంలోని నివాస ప్రాంతాల సమీపంలో ఈ ట్రక్కు పేలుడు సంభవించిందని చెప్పారు. సిరియాలోని యూఎస్ సంకీర్ణ దళాలకు స్థానిక కుర్ధిష్ మిలటరీ సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఈ దాడికి తెగబడిందని ఉన్నతాధికారి వివరించారు.

English summary

A triple truck-bomb attack carried out by Islamic State in Syria. In that attack 50 people killed and wounded 80 others