బ్రిటన్‌పై పారిస్‌ తరహా దాడి చేస్తాం: ఐసిస్‌

ISIS Warning To Britain

05:58 PM ON 1st February, 2016 By Mirchi Vilas

ISIS Warning To Britain

ఉగ్రవాద చర్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) ఉగ్రవాద సంస్థ మరో భారీ దాడి చేయనున్నట్లు ప్రకటించింది. తమపై యుద్ధం చేస్తున్న బ్రిటన్‌పై పారిస్‌కు మించిన దాడి చేస్తామని హెచ్చరించింది. బ్రిటన్‌ భారీ మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అరబిక్‌ పత్రిక ‘అల్‌-నబ’ తాజా ఎడిషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌పై ఐసిస్‌ ఉగ్రమూక చేసిన దాడిలో 130మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ది సండే టైమ్స్‌ కథనం ప్రకారం.. ఐసిస్‌ తాజా ఎడిషన్‌లో యూఎస్‌ డ్రోన్‌ దాడిలో మృతి చెందిన జిహాదీ జాన్‌ మహ్మద్‌ ఎమ్‌వాజీని పొగడ్తలతో ముంచెత్తింది. అతని మాటలకు మరణం లేదని తెలిపింది. ఐసిస్‌ను అంతమొందించేందుకు బ్రిటన్‌ పార్లమెంట్‌ గత నెలలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఐసిస్‌ తాజా హెచ్చరికల నేపథ్యంలో బ్రిటన్‌లోని కీలక ప్రాంతాల్లో దాడికి తెగబడనున్నట్లు తెలుస్తోందని ది సండే టైమ్స్‌ పేర్కొంది. వాటిలో సెంట్రల్‌ లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌, నేషనల్‌ గ్యాలరీలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.

English summary

Islamic state terrorist group gives warning to Britain government that they will attack Britain. ISIS warns that the UK should be prepared for an attack more severe than in Paris last November which claimed 130 lives.