‘ఫేస్‌బుక్, ట్విట్టర్ సీఈవోలను చంపుతాం’

ISIS Warning To Facebook And Twitter CEO's

10:07 AM ON 26th February, 2016 By Mirchi Vilas

ISIS Warning To Facebook And Twitter CEO's

ట్విట్టర్‌లో కొద్దిరోజుల క్రితం 125000 అకౌంట్లను టెర్రరిస్ట్‌లకు సంబంధించినవిగా పేర్కొంటూ బ్లాక్ చేయగా, ఫేస్‌బుక్‌ సీఈవో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఓ సంచలన ప్రకటన చేసింది. గత కొన్నిరోజులుగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఐసిస్‌కు వ్యతిరేకంగా సందేశాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ సీఈవోలను చంపుతామంటూ ఐసిస్ పేరుతో వచ్చిన ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతోంది. ట్విట్టర్‌లో అకౌంట్లను బ్లాక్ చేసిన నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా జరిగే ఐసిస్ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయట. దీంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ సీఈవోలను చంపేస్తామంటూ ఐసిస్ పేరుతో ఓ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. సన్స్ కాలిఫేట్ ఆర్మీ పేరుతో విడుదలైన ఆ వీడియోలో జుకర్‌బర్గ్, జాక్‌ ముఖంలోంచి బుల్లెట్లు దిగినట్లుగా వుండడం గమనార్హం.

English summary

Islamic state terrorists warned Facebook CEO Mark Zuckerberg and Twitter CEO Jack Dorsey for blocking unauthorized accounts and terrorist activity accounts.