ఎఫ్ బి ఖాతాలు తొలగించమంటూ ముస్లిం మహిళలకు ఆంక్షలు

Islamic Restrictions On Muslim Women

11:30 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Islamic Restrictions On Muslim Women

దూసుకుపోతున్న సోషల్ మీడియాలో ఎన్నో చైతన్య వంతమైన కధనాలు , వ్యాఖ్యలు వస్తున్నా , అదే సోషల్ మీడియాలో చేరడంపై కూడా నిషేధాలు విధించే విధంగా మహిళలపై ఆంక్షలు అమలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.‘ది టైమ్స్‌’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్‌బుక్‌ ఖాతాలు తొలగించాలని, ట్రౌజర్లు వేసుకోవద్దని, భర్తల అనుమతితోనే భార్యలు బయటకు వెళ్లాలని.. యూకేలోని పలు మసీదులు ముస్లిం మహిళలకు ఆంక్షలు విధిస్తున్నాయట. బ్రిటన్‌లోని మసీదులు, ఇస్లామిక్‌ అసోసియేషన్లు ప్రచురించిన కొన్ని నియమ నిబంధనలపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఇందులో చాలా మసీదులు ముస్లిం మహిళల ఆధునికతపై ఆంక్షలు విధిస్తున్నాయి. భార్యాభర్తలకు సూచనలు అనే పేరుతో ఓ మసీదు విడుదల చేసిన డాక్యుమెంట్లో.. భర్తల అనుమతి తీసుకునే భార్యలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ఉందని సర్వే వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

ఫేస్‌బుక్‌ విషయ వలయం వంటిదనీ, దాన్ని వాడకూడదనీ, ఆ ఖాతాలను తొలగించుకోండనీ మరో మసీదు చెప్పింది. ట్రౌజర్లు వాడటం కూడా ఒకరకంగా నేరమేనని మరికొన్ని మసీదులు నిబంధనలు విధించాయి. ఇలా చాలా మసీదులు ఆధునికతపై ఇంకా వ్యతిరేక భావనతోనే ఉన్నాయి.ఈ సూచనలను కొందరు ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు. పాత తరాల వారు ఆధునికతను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. మొత్తానికి అనాచారాలు సాంకేతికత పై కూడా ప్రభావం చూపుతున్నాయన్న మాట.

ఇవి కూడా చదవండి:సీక్రెట్ ప్లేసులో 'ఓం' టాటూ వేయించుకున్న పాప్ సింగర్!

ఇవి కూడా చదవండి:నాలుగు అంతస్తుల పై నుంచి పిల్లల్ని తోసేసిన తల్లి

English summary

Some of the masjid's and Islamic people were putting some restrictions on Muslim woman by saying that they should not wear some type of dresses and they should not maintain Facebook Accounts also.