మంత్రి ఇంట్లో దొరికిన బంగారం, డబ్బు ఎంతో తెలిస్తే షాకవుతారు

I.T department recovered huge amount of money and gold in minister's Home

11:37 AM ON 24th January, 2017 By Mirchi Vilas

I.T department recovered huge amount of money and gold in minister's Home

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటి దాడులు చాలా చోట్ల పధకం ప్రకారం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కర్ణాటకలో ఐటీ అధికారులు అవాక్క య్యే విధంగా ఓ ఘటన జరిగింది. అవును, ఓ మంత్రి ఇంటిపై జరిపిన ఐటీ సోదాల్లో లెక్కచూపని సొమ్మును చూసి ఖిన్నులయ్యారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న సతీశ్ జర్కీహోలి అక్రమాస్తులు కూడ బెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న అధికారులు సోమవారం ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లు ఇతర ఆస్తులున్న ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో రూ.12 కిలోల బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో లెక్క చూపని డబ్బు దాదాపు రూ.112 కోట్లు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. ప్రస్తుతానికి మంత్రి కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఇంకా ఎలాంటి దాడులు పలుచోట్ల చేయడానికి రంగం సిద్ధం అయినట్లు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి : సరికొత్త స్మార్ట్ ఫోన్ తో నోకియా ...

ఇది కూడా చూడండి : జియో స్పీడ్ పెరిగిందా లేదా?

English summary

I.T department recovered huge amount of money and gold in minister's Home.This issue occurred in Karnataka with the minister Satish Jarki holi.