ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం 

IT Employee Killed In Banglore

09:58 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

IT Employee Killed In Banglore

అందివచ్చిన సాంకేతిక ప్రగతి, విస్తరిస్తున్న సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఆగడాలు సాగించే, దారుణాలకు ఒడిగట్టే ప్రబుద్ధులు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్నే షాక్‌కు గురి చేశాడు ఓ కిరాతకుడు. ఫేస్‌బుక్‌ పరిచయాన్ని ఆధారంగా చేసికుని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రాణాలు తీసిన వైనం ఇది. పెళ్లి చేసుకుందామంటూ తీయటి కబుర్లు చెప్పినవాడే నిలువునా ప్రాణాలు తీసేసాడు. ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్‌లోనే ఈ దారుణానికి తెగబడ్డాడు. కేవలం 20 రోజుల్లోనే ఈ తతంగం అంతా కానిచ్చేసాడు. కనీ వినీ ఎరగని రీతిలో సాగిన ఈ దారుణ ఘోరంతో బెంగుళూరు ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే,

పంజాబ్‌కు చెందిన కుసుమ్‌ రాణి సింగ్లా(31) దిల్లీ శివారు గురుగావ్‌లో ఐబీఎం కంపెనీలో పని చేస్తూ, ఆర్నెల్ల క్రితమే ఆమె బెంగళూరుకు బదిలీ అయింది. 20 రోజుల క్రితమే హరియాణాకు చెందిన సుఖబీర్‌సింగ్‌(28) అనే నిరుద్యోగి ఆమెకు ఫేస్‌బుక్‌లో తారస పడ్డాడు. స్నేహం కోసం రిక్వెస్ట్ పెట్టాడు. సుఖబీర్‌ 2011 నుంచి 2013 వరకు బెంగళూరులోనే యాక్సెంచర్‌, యాహూ, ఇతర కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసి ప్రస్తుతం సొంత రాష్ట్రం హరియాణాలో ఖాళీగా ఉంటున్నాడు. అయితే కుసుమ్‌ మొదట్లో ఫేస్‌బుక్‌ స్నేహానికి నిరాకరించినా తరువాత ఒకే చేసింది.

ఇంకేముంది, ఇద్దరూ గంటల తరబడి చాటింగ్. దీంతో తీయటి కబుర్లకు దారితీసింది. అప్పటికే పెళ్లై, విడాకులు తీసుకుని కుసుమ్‌ ఒంటరిగా ఉండడంతో, ఈ విషయాన్ని ఎడ్వాంటేజ్ గా తీసుకున్నసుఖబీర్‌ పెళ్లి ప్రతిపాదన పెట్టేసాడు. ఇక దానిపైనే ఫేస్‌బుక్‌ ముచ్చట్లు జరుగుతుండగానే హఠాత్తుగా బెంగళూరుకు వచ్చేసాడు. మంగళవారం ఉదయం 8.45 గంటలకు దిల్లీ నుంచి విమానంలో నగరానికి వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అపార్ట్‌మెంట్‌ ముందు వాలిపోయాడు.

కుసుమ్‌తో పాటు ఫ్లాటులో ఉంటున్న తోటి ఉద్యోగిని నిధి శర్మ అప్పటికే విధులకు వెళ్ళిపోయింది. కుసుమ్‌ ఒక్కర్తే ఇంట్లో వుందని గ్రహించి, మెల్లిగా రంగప్రవేశం చేసాడు. ఆమె అనుమతితోనే అపార్ట్‌మెంట్‌ భద్రతా సిబ్బంది సుఖబీర్‌సింగ్‌ను లోపలికి రానిచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కలిసి భోజనం చేశారు. ఇక అసలు కధ అప్పుడు మొదలైంది. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, రూ.50 వేలు సర్దుబాటు చేయాలని సుఖబీర్‌ దీనంగా అడిగాడు. అంతే అతని నిజ స్వరూపం ఏమిటో కుసుమ్‌ పసిగట్టేసింది. ఆగ్రహం వ్యక్తంచేస్తూ, బయటకు వెళ్లాలని హూంకరించింది. కనీసం డిల్లీ వెళ్ళడానికి ఛార్జీకైనా డబ్బులు సర్దుబాటు చేయాలని అతడు అడగడం, ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్యా, వాగ్వాదం స్టార్ట్ అయింది.

కోపం పట్టలేక బల్లపై ఉన్న కలంతో ఆమె నుదుటిపై పొడిచేసాడు. కిందపడిన ఆమె గొంతుకు ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ వైరు చుట్టి హత్య చేశాడు. ఆమె నోరు, ముక్కుల ద్వారా విపరీతంగా రక్తం కారినా, మరకల తో వున్న అతని ఫాంటు అక్కడే వదిలేసి కుసుమ్‌ ఫ్యాంటు ధరించాడు అంతకు ముందే ఆమె నగలు, రెండు సెల్ ఫోన్లు , హాండ్ బ్యాగ్ లో వున్న నగదు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు మూట కట్టేసుకున్న, సుఖబీర్‌ ఏమీ తెలీనట్టుగా, మెల్లగా బయటపడ్డాడు. క్రెడిట్‌ కార్డు ఉపయోగించినా నగదు రాకపోవడంతో సంబంధిత బ్యాంకుకు ఆమె సెల్ నుంచి ఫోన్‌ చేసి సీక్త్రేట్ కోడ్ తెలుసుకున్నాడు. 11 వేలు డ్రా చేసుకుని విమానంలో దిల్లీకి చెక్కేశాడు.

అయితే బెంగళూరు పోలీసులు ఈ కేసును 24 గంటల్లో చెధించారు. తొలుత స్నేహితురాలు నిధి శర్మను, కుసుమ్‌ మాజీ భర్త ఆకాష్‌నూ ప్రశ్నించాక ఫేస్‌బుక్‌ ద్వారా హంతకుడు సుఖబీర్‌ జాడను గుర్తించారు. వెంటనే గురుగావ్‌లో అతన్ని అరెస్టు చేసి, బెంగళూరుకు తీసుకొచ్చారు. ఫేస్ బుక్ లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండకపోతే, ప్రాణాల మీదికి తెస్తుందని గ్రహిస్తే మంచిది.

English summary

An IT employee who was doing job in IBM named Kusum was murdered by one of her facebook friend Named Sukhbeer.He was known him by the victim by facebook.This tuesday he visited his facebook friend Kusum and asked her to give money then she rejected to give money. Then that man gets angry and killed her.Within 24 hours police caught the murdered guy in haryana