ఐటి కంపెనీ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన 'పారనోయా'

IT employees is suffering with Paranoia disease

01:18 PM ON 24th October, 2016 By Mirchi Vilas

IT employees is suffering with Paranoia disease

చాలామంది ఐటి కంపెనీ ఉద్యోగులను చూసి, వీళ్ళకేం అని అనుకుంటారు. కానీ ఎవరి కష్టాలు వారివి అనే సామెత ఉండనే వుంది కదా. ఇదిగో ఇప్పుడు ఐటీ కంపెనీల ఉద్యోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. అమెరికా నుంచి వారి మనసులను ఎవరో రహస్యంగా నియంత్రిస్తున్నారు. సాధారణంగా ఇటువంటివి సైన్స్ ఫిక్షన్ కథల్లోనో, హాలీవుడ్ సినిమాల్లోనో ఇటువంటివి కనిపిస్తాయి. కానీ ఇప్పుడిది ఐటీ రాజధాని బెంగళూరుకు పాకింది. తమ మనసులను ఎవరో నియంత్రిస్తున్నారంటూ ఎంతోమంది టెక్కీలు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక టెక్కీల ఫిర్యాదులను బట్టి చూస్తే వారు పారనోయా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇదో భావన మాత్రమేనని వారు పేర్కొన్నారు. తన మనసును యూఎస్ ఫెడరల్ పోలీసులు నియంత్రిస్తున్నారంటూ ఇటీవల మహిళా ఐటీ ఉద్యోగి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది. మొదట్లో ఆమె తమ వద్దకు వచ్చినప్పుడు తన మాజీ భర్త అమెరికాలో ఉన్నట్టు చెప్పింది. దీంతో భర్తతో ఆమెకేవైనా ఆస్తివివాదాలు ఉన్నాయోమోనని ఆరా తీస్తే అటువంటివి ఏమీ లేవని తేలింది. దీంతో ఆమె పారనోయాతో బాధపడుతున్నట్టు గుర్తించాం అని కర్ణాటక మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ మీరా సక్సేనా పేర్కొన్నారు. ఇటువంటి కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నట్టు సక్సేనా తెలిపారు.

1/5 Pages

రిటైర్డ్ సూపర్ కాప్ కేపీఎస్ గిల్ తన మెదడులో ఓ చిప్ అమర్చి తనను నియంత్రిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. గిల్ తన మెదడును చాలారోజులుగా నియంత్రిస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఇంకో కేసులో తమిళనాడు పోలీసులను తన ఆలోచనను నియంత్రిస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. ఇటువంటి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.

English summary

IT employees is suffering with Paranoia disease