బాహుబలి నిర్మాతలకి తగిలిన దెబ్బ(వీడియో)

IT officers ride on Baahubali movie producers

10:34 AM ON 12th November, 2016 By Mirchi Vilas

IT officers ride on Baahubali movie producers

ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ తగిలిందని అంటుంటే, తాజాగా ఐటి దాడులు కూడా హెచ్చాయి. బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లలో ఏకకాలంలో ఇన్ కంమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్రాంతాల్లో 25 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు రూ.60కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఇంకా భారీగా నగదు, పలు కీలక పత్రాలు లభించే అవకాశం ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.

1/4 Pages

గోల్డ్ షాపులపైనా సోదాలు...


ఇక బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన గోల్డ్ షాపులపై కేంద్రం దృష్టి సారించింది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తున్న నేపథ్యంలో ఆదాయపన్నుశాఖ దాడులు ముమ్మరం చేసింది. అక్రమంగా డబ్బు సంపాదించిన వారంతా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఐటీశాఖ అధికారులు రంగంలోకి దిగేశారు. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో దాదాపు 600 బంగారు షాపులపై దాడులు చేసినట్టు సమాచారం.

English summary

IT officers ride on Baahubali movie producers