మెడికల్ కాలేజీలో పట్టుబడ్డ నల్ల డబ్బు.. ఎంతో తెలిస్తే మతిపోతుంది!

IT officers seized 43 crores at Bangalore medical college

03:35 PM ON 29th September, 2016 By Mirchi Vilas

IT officers seized 43 crores at Bangalore medical college

కర్ణాటకలో మొత్తం 46 వైద్యకళాశాలలు ఉండగా అందులో 14 కళాశాలలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. అయితే ఓ ప్రేవైట్ కాలేజీలో ఒకటి రెండు కాదు ఏకంగా... కట్టలకొద్దీ సొమ్ము... పైగా చిన్న నోట్లు కాదాయే.. అన్నీ 500, 1000 రూపాయల నోట్లే! అన్నిటినీ కలిపి లెక్కబెట్టి కట్టగడితే ఒక ట్రక్కు నిండిపోయేంత సొమ్ము. ఇన్ని కోట్లు. లెక్కల్లో చూపని అక్రమ ఆదాయమేనట. ఇంతకీ ఎక్కడంటే, బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని 'వైదేహి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్' పై ఆదాయపన్నుశాఖ అధికారులు మంగళవారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించగా, బయటపడ్డ సొమ్ము ఇది.

ఆ నోట్ల కట్టలను తరలించేందుకు ఏకంగా ఒక ట్రక్కునే రప్పించాల్సి వచ్చింది. దీన్ని దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ దాడిగా పేర్కొంటున్నారు.

1/4 Pages

ఇంతకీ సొమ్ము ఎంతంటే 43కోట్లు. గతంలో పాండిచ్చేరిలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలపై ఐటీ అధికారులు దాడి జరిపి రూ.82 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే కర్ణాటకలో మాత్రం ఇంత భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. రాయచూరులోని ఓ వైద్య కళాశాలపై 2015 డిసెంబరులో దాడులు జరిపి రూ.19.5 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో ఇన్నాళ్లుగా అదే అతిపెద్ద మొత్తంగా రికార్డులలో నమోదై ఉంది.

English summary

IT officers seized 43 crores at Bangalore medical college