దాడులకు వెళ్లిన ఐటి అధికారులపై కుక్కను ఉసిగొల్పారట

IT officials went for checking dog attacks

11:33 AM ON 15th December, 2016 By Mirchi Vilas

IT officials went for checking dog attacks

లెక్కకు మించిన ఆదాయం కలిగిన నల్ల అక్రమార్కుల ను పట్టుకునేందుకు నిమగ్నమయిన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఓ వింత అనుభవం ఎదురైంది. బెంగళూరులో ఓ అపార్ట్ మెంట్ లో తనిఖీలు నిర్వహించే సమయంలో అక్కడ కాపలాగా ఉన్న ఓ వృద్ధురాలు వారి పైకి పెంపుడు కుక్కల్ని వదిలింది. అయితే పోలీసుల సహాయంతో వాటిని దాటుకుని లోపలికి వెళ్లిన వారికి పెద్దఎత్తున నగదు పట్టుబడింది.

సుమారు రూ.2.89 కోట్ల లెక్కలు చూపని నగదును వారు దాడిలో పట్టుకున్నారు. ఇందులో రూ.2.25కోట్లు అచ్చంగా కొత్త రూ. 2000వేల నోట్లు కావడం గమనార్హం. ఈ ఘటన బెంగళూరులోని యశ్వంతపురలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఆ నగదు తనది కాదని, సమీపంలోని ఓ క్లబ్ కు చెందిందని సదరు వ్యక్తి వాదించాడు. అయితే, క్లబ్ మీద కూడా దాడులు జరపడంతో చివరికి ఆ మొత్తం తనదేనని వ్యక్తి ఒప్పుకొన్నాడు. ఆ వ్యక్తి వివరాలను ఐటీ అధికారులు బయట పెట్టలేదు.

కాగా నోట్ల రద్దు తర్వాత నగదు, బంగారాలను అక్రమంగా తరలిస్తూ విమానాశ్రయాల్లో పట్టుబడిన మొత్తం వివరాలను సీఐఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయ తనిఖీల్లో రూ.70కోట్ల నగదు, 170కేజీల బంగారాన్ని పట్టుకున్నామని తెలిపారు.

ఇందులో ఎక్కువగా కొత్త నోట్లు లభ్యం అయ్యాయి. కొత్త నోట్ల కోసం ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట గంటల తరబడి క్యూల్లో నిలబడుతుంటే అక్రమార్కులు మాత్రం విచ్చలవిడిగా కొత్త నోట్ల తరలింపు చేస్తూ, ఇలా పట్టుబడుతున్నారు.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు ఈ 4 సూచనలు పంపుతాడట

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

English summary

IT Officials Went For Checking Dog Attacks