వావ్ ... అతడు చెట్టుకింద ప్లీడరే... కానీ అతని ఇంట రూ. 157 కోట్లు!

IT raid on the delhi lawyer and seized 157 crores

11:24 AM ON 13th December, 2016 By Mirchi Vilas

IT raid on the delhi lawyer and seized 157 crores

ఈమధ్య ఆదాయపు పన్ను అధికారులు విస్తృతంగా చేస్తున్న తనిఖీల్లో అనేకరకాల నిజాలు వెలుగుచూస్తున్నాయి. కోట్లకు కోట్లు డబ్బులు బయట పడుతున్నాయి. అందులో కొత్త నోట్లు కూడా ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా రోహిత్ టాండన్ అనే ఓ న్యాయవాది పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. సుప్రీంకోర్టు కాదు కదా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లో కూడా ఎవరూ ఆయనను గుర్తుపట్టరు. కానీ ఇప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి మీద చేసిన దాడుల్లో ఏకంగా రూ. 157 కోట్లు బయటపడ్డాయి. ఒకసారి కాదు.. ఏకంగా మూడు సార్లు దాడులు చేశారు. తాజాగా చేసిన దాడిలో 13.5 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. వాటిలో రద్దుచేసిన 500, 1000 రూపాయల కట్టలతో పాటు కొత్తగా విడుదలైన 2వేల రూపాయల కట్టలు కూడా ఉన్నాయి. వీటిలో కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లే ఏకంగా రూ. 2.61 కోట్ల మేరకు ఉన్నాయి. అన్ని నోట్లు ఈయనకు ఎక్కడినుంచి వచ్చాయన్న విషయమై ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు అధికారుల హస్తం లేకుండా ఇది సాధ్యం కాదని అంటున్నారు. ఆదాయపన్ను శాఖతో పాటు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు కలిసి చేసిన సోదాల్లో.. టాండన్ ఇంట్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా నోట్లు బయటపడ్డాయి. అట్టపెట్టెల్లో దాచిపెట్టిన నగదును మొత్తం బయటకు తీశారు. అయితే టాండన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతడికోసం గాలింపు మొదలైంది.

దాదాపు గత రెండు నెలలుగా టాండన్ మీద ఢిల్లీ పోలీసులు కన్నేసి ఉంచారు. తొలిసారి అక్టోబర్ 7వ తేదీన ఈయన ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడి చేసినప్పుడు ఏకంగా 125 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. తాజాగా జరిగింది మూడో దాడి. రెండు వారాల క్రితం రెండోసారి దాడిచేసినప్పుడు రూ. 19 కోట్లు బయటపడ్డాయి. వీటిలో ఏ మొత్తానికీ ఆయన వద్ద లెక్కలు లేవు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు ముగిసిన వారం రోజుల తర్వాత అందిన పక్కా సమాచారంతో తొలిసారి అక్టోబర్ 7న దాడి చేశారు. అప్పట్లో మనీలాండరింగ్ కు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా బయటపడ్డాయి. ఇప్పటి వరకు మూడు సోదాల్లో కలిపి ఈయన వద్ద రూ. 157 కోట్లు స్వాధీనమయ్యాయి. ఇంకా మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్ : జయ వారసురాలు ఈమెనట

ఇవి కూడా చదవండి: త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు!

English summary

IT officials was doing many raids in all over India and now they have made raid on a lawyer named Rohit Tandan and they have seized 157 crores from him.