టిటిడి బోర్డు సభ్యుడి ఇంట్లో దొరికిన సొమ్మెంతో తెలిస్తే షాకవుతాం (వీడియో)

IT Raid On TTD Board Member Rajashekar Reddy

11:02 AM ON 9th December, 2016 By Mirchi Vilas

IT Raid On TTD Board Member Rajashekar Reddy

రూ 500, రూ 1000 నోట్లు రద్దు తర్వాత జనం ఎటిఎంల ముందు, బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్న ఫలితం రావడం లేదు. ఈ సమయంలో పలు విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయం జరిగి సరిగ్గా నెల రోజులు పూర్త యిన తరువాత ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఒకటి కాదు రెండు ఏకంగా 70 కోట్ల రూపాయల కొత్త నోట్ల కట్టలు ఆంధ్ర ప్రదేశ్ లో దర్శనమిచ్చాయి. అది కూడా తిరుమలేశుడి సన్నిది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో నల్లధనం కట్టలు కట్టలుగా దర్శనమిచ్చింది. భారీ మొత్తంలో బంగారం సైతం బయటపడింది.

టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి కి చెందిన పాండిచ్చేరి మార్గంలోని ఇళ్లపై ఐటీ అధికారులు ఒక్క సారిగా దాడులు నిర్వ హించారు. ఈ దాడుల్లో కళ్లు చెదిరే నిజాలు బయటకి వచ్చాయి. చెన్నైలో ఉన్న అతని ఇంటితో పాటూ ఆయన బంధువుల ఇళ్ల పై కూడా ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఆ సోదాల్లో రూ.90కోట్ల పైగా నగదు బయటపడింది. అయితే ఇందులో మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే అందులో రూ.70 కోట్ల విలువ చేసే మొత్తం కొత్త నోట్ల రూపంలో ఉండడమే. దీంతో ఐటి అధికారులు కూడా ఒక్క సారిగా షాక్ గురయ్యారు. ఇంత మొత్తంలో కొత్త నోట్లు ఎలా వచ్చాయని శేఖర్ రెడ్డిని ఆరా తీస్తున్నారు. ఈ డబ్బుతో పాటు వంద కిలోల బంగారం కూడా సోదాల్లో స్వాదీనం చేసుకున్నారు అధికారులు. ఈ కొత్త నోట్ల వ్యవహరంలో పలువురు బ్యాంకు అధికారులు సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. శేఖర్ రెడ్డికి సబందించిన బంధువుల ఇళ్ల పై ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో 50కి మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొన్నట్టు సమాచారం. పక్కా సమాచారం ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు భారీ మొత్తంలో డబ్బును సీజ్ చేశారు. టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్న ఈయన తమిళనాడులో ఇసుక , గనుల వ్యాపారం చేస్తున్న ట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి: బాహుబలి సృష్టికర్త రాజమౌళికి చంద్రన్న పిలుపు!

ఇవి కూడా చదవండి:అమ్మ మరణం వెనుక కుట్ర ?.... మరి చెంపపై ఆ గుర్తులేంటి..?

English summary

Yesterday IT department officials made Raid on TTD Board Member Rajashekar reddy and IT officials had found 70 crores of New 2000 Rupees Currency notes and 100 kilograms of Gold. IT officials were in investigation how he got this much of New Currency Rupees Notes.