టి టిడిపి ఎమ్మెల్యే ఇంటి పై ఐటి దాడులు 

IT raids on T-Tdp MLA

10:26 AM ON 17th December, 2015 By Mirchi Vilas

IT raids on T-Tdp MLA

ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం రాత్రి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడులు నిర్వహించారు. ఆయన నుంచి దాదాపు 18 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలు కూడా సొంతం చేసుకున్నారు. నవోదయ ఎడ్యుకేషన్ ట్రస్టుతోపాటు మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఆయన ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఈ ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టకపోవడమే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. గతఎన్నికల్లో నారాయణ పేట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన 50 ఏళ్ల రాజేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా వాసి.

మహబూబ్‌నగర్‌జిల్లాలో కంటే ఈయన సొంత ఆస్తులు కర్ణాటకలోని రాయ్‌చూర్‌‌లో ఎక్కువగా వున్నాయి. రీసెంట్‌గా ఆయన అక్కడ ఎంఫార్మసీ కాలేజీని నిర్మించారు. ఈ క్రమంలో ఆయన లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీ అధికారులు.. కర్నాటకలోని రాయ్‌చూర్, గుల్బర్గా, బెంగళూరు, తెలంగాణ‌లోని మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపు 30 మంది అధికారులు ఏకకాలంలో ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో రాజేందర్ తన ఆస్తులను 29 కోట్ల రూపాయలుగా ప్రస్తావించారు.

English summary

IT department rides on Telangana TDP MLA Rajendar Reddy House and office today. Upto now IT officers have seized 18 crore money