బ్లాక్ మనీకి అడ్డా ఈ బ్యాంక్...అందుకే దాడులు

IT Rides On Axis Bank Regarding Black Currency

04:34 PM ON 23rd December, 2016 By Mirchi Vilas

IT Rides On Axis Bank Regarding Black Currency

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యులు క్యూలో ఉండి అష్టకష్ఠాలు పడితే, యథేచ్ఛగా బ్యాంకుల్లో అడ్డదారిన డబ్బులు ఇచ్చేశారని ,తద్వారా బ్లాక్ మనీ వున్నవాళ్లు బానే జాగ్రత్త పడ్డారని ఆరోపణలు రావడం, విస్తృతంగా ఐటి దాడులు జరుగుతుండడం తెలిసిందే. ఇక బ్లాక్ మనీకి యాక్సిస్ బ్యాంక్ కేరాఫ్ అడ్రస్ అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒక్కోరోజు ఒక్కో యాక్సిస్ బ్యాంక్ శాఖలో పేరుకుపోతున్న బ్లాక్ మనీ గుట్టలు దొరకడం చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.

ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంక్ కి చెందిన మూడు బ్రాంచీలపై ఐటీశాఖ పంజా విసిరింది. తాజాగా అహ్మదాబాద్ లోని యాక్సిస్ బ్యాంక్ శాఖపై దృష్టి సారించిన ఐటిశాఖ అక్కడ పెద్దఎత్తున బ్లాక్ మనీ డిపాజిట్ అయిన విషయాన్ని గమనించింది. ఈ బ్యాంక్ కు చెందిన ఒకే బ్రాంచ్ లో 19 నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి 89 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిన విషయం ఐటి సోదాల్లో బయటపడింది. ఈ బాగోతానికి సంబంధించి నలుగురు యాక్సిస్ బ్యాంక్ అధికారులను ఐటి శాఖ ప్రశ్నిస్తోంది. చాలామంది ఉద్యోగులు ఇంటి బాట పట్టడం ఖాయమని అంటున్నారు.

ఇది కూడా చూడండి: వేప పొగతో వైరస్ మాయం - అంతేకాదు ...

ఇది కూడా చూడండి: ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్నారా? అయితే దీనితో నివారించొచ్చు..

ఇది కూడా చూడండి: వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే!

English summary

IT Rides On Axis Bank Regarding Black Currency.