ఆ మెయిళ్లకు రిప్లై ఇవ్వొద్దు: ఐటీ

IT Says Beware Of Fake Emails

11:09 AM ON 6th February, 2016 By Mirchi Vilas

IT Says Beware Of Fake Emails

ఆదాయపు పన్ను వివరాల కోసం పిన్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌ తెలపాలంటూ వచ్చే ఈ-మెయిళ్లకు ఎలాంటి జవాబూ ఇవ్వొద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. అవి పూర్తిగా నకిలీవని ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజల వ్యక్తిగత ఆర్థిక సమాచారం.. అంటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నంబర్లు, పిన్‌, పాస్‌వర్డ్‌లాంటి వాటిని ఐటీ శాఖ ఈ-మెయిల్‌ ద్వారా అడగబోదని అధికారులు స్పష్టం చేశారు. అలాంటి ఈ మెయిల్స్‌ వస్తే.. అవి కచ్చితంగా నకిలీవేనని.. వాటికి జవాబిస్తే ప్రమాదమని తెలిపారు. ఒకవేళ అలాంటి ఈ-మెయిల్స్‌ వచ్చినట్లయితే.. incident@cert-in.orgకి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సదరు నకిలీ మెయిల్స్‌లో వచ్చే లింక్‌లను కూడా క్లిక్‌ చేయొద్దని.. వాటిని క్లిక్‌ చేసినా.. వ్యక్తిగత సమాచారం బదిలే అయ్యే అవకాశముంటుందని హెచ్చరించారు.

English summary

The Income Tax department today warned the public against responding to emails which was coming from private addresses.