ఆ సినిమా వీరితో చేస్తే 60 కోట్లు అయ్యేదట !

It Will Be More Expensive Says Dil Raju

12:56 PM ON 19th February, 2016 By Mirchi Vilas

It Will Be More Expensive Says Dil Raju

మామూలుగా స్టార్‌ హీరోలు సినిమాలంటే ఇప్పుడున్న కాలంలో మినియమ్‌ 50 కోట్లు ఖర్చవుతుంది. కాస్త ఎక్కువనుకుంటే 60 కోట్లు అవుతుంది. దీనిలో హీరో, హీరోయిన్‌ పారితోషికానికే సగం అయిపోతుంది. ఇంక మిగిలిన బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించుతారు. తాజాగా దిల్‌ రాజు నిర్మించిన చిత్రం 'కృష్ణాష్టమి'. మొదట ఈ చిత్ర కథను ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ కి వినిపించారట. వాళ్ళిద్దరూ నో చెప్పడంతో దిల్‌రాజు సునీల్‌తో నిర్మించాడు. ఈ చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 19) విడుదలవుతుండగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ కోసం ఈ విధంగా స్పందించాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌తో కానీ, అల్లు అర్జున్‌ తో కానీ తీస్తే 60 కోట్లు ఖర్చయ్యేది. వాళ్ళు నో చెప్పడంతో సునీల్‌తో తీశాం. దీనికి 15 కోట్లు మాత్రమే ఖర్చయింది అని చమత్కరించాడు. అయినా స్టార్‌ హీరోలతో సినిమా అంటే అందరూ స్టార్‌ యాక్టర్లే కావాలి దీనితో బడ్జెట్‌ తడిసి మోపిడవుద్ది. ఇలా చిన్న హీరోలతో అయితే తక్కువలో తక్కువ సినిమా పూర్తి చేసేయొచ్చు. మరి సునీల్‌ ఎంత వరకు కలెక్షన్లు రాబడతాడో చూడాలి.

English summary

Tollywood Star Producer Dil Raju says that Krishnastami movie was first narated to Allu Arjun and NTR but they did not accepted that movie.He says that this movie was completed with 15 crores and if they make movie with a top hero then this movie budget would be 60 crores because of the remuneration and etc.