ఆ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బ్రతుకుతారు.. ఆ రహస్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు!

Italy Acciaroli village people secret

05:30 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Italy Acciaroli village people secret

ప్రస్తుత కాలంలో ఆరోగ్యముగా ఉండడం అంటే.. అదో పెద్ద సవాల్. చిన్నపిల్లల దగ్గర నుండి.. పెద్ద వాళ్ళ దాకా ఎక్కువ శాతం మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీనితో మనిషి 45 ఏళ్ళు దాటగానే ముసలి తనం రావడం.. ఆ తరువాత 60 నుండి 70 ఏళ్ల కన్నా జీవించ లేకపోవడం జరుగుతుంది. అయితే.. ఇటలీ దక్షిణ తీర ప్రాంతంలోని అకియోరోలీ అనే గ్రామంలో వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీనితో వారి ఆరోగ్య రహస్యం కోసం శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. ఆ గ్రామస్తుల ఆరోగ్య రహస్యం గురించి ఆరు నెలల పాటు తలలు బద్దలు కొట్టుకున్న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఆ గుట్టు పట్టుకున్నారు. అకియోరోలీ గ్రామ జనాభా 800 మంది కాగా.. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే.

ప్రతి 10 మందిలో ఇద్దరికి పైగా 100 ఏళ్లు దాటిన వాళ్లే. మిగిలిన వాళ్ళు 80 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు కూడా ఎక్కువే. 80 ఏళ్ల వయసు వచ్చినా.. చక్కని ఆరోగ్యంతో ఉండడానికి కారణం ఔషధ గుణాలతో కూడిన మొక్కలకు ఆ ప్రాంతం ఆలవాలంగా ఉండడమే. అంతే కాదు.. ఈ గ్రామస్తులు అనుసరించే కష్టే ఫలి అన్న సూత్రం కూడా చక్కని ఆరోగ్యానికి తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తెలుసుకున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం వరకు శారీరకంగా కష్టపడుతూ.. ఎలాంటి కాలుష్య ప్రభావం లేకుండా.. పురుగు మందుల అవసరం లేకుండా సహజ సిద్ధంగా స్వయంగా సాగు చేసుకున్న వాటిని తినడం వల్ల చక్కని ఆరోగ్యంతో ఆ గ్రామస్తులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చీక్స్ ఫ్యాట్ కరిగించుకోవడానికి అద్భుతమైన టిప్స్

ఇది కూడా చదవండి: ప్రపంచంలో టాప్ 10 అందగత్తెలు వీరే!

ఇది కూడా చదవండి: 'ఇంకొక్కడు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Italy Acciaroli village people secret