'సావిత్రి'ని పెళ్లి చేసుకుంటున్న జెడి చక్రవర్తి

J D Chakravarthy marriage with Anukriti Sharma

04:59 PM ON 19th July, 2016 By Mirchi Vilas

J D Chakravarthy marriage with Anukriti Sharma

రెండు రోజుల క్రితం 'పాప' అనే సినిమాకు సంబంధించి ఒక గొడవ జరిగిన సంగతి తెలిసిందే.. 'పాప' మూవీ డైరెక్టర్ యోగానంద్ తనను బూతు డైలాగులు చెప్పమని వేధిస్తున్నాడని హీరోయిన్ అనుకృతి శర్మ షూటింగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడా గొడవ కొత్త మలుపు తీసుకుంది.. నిజానికి ఈ భామ రామ్ గోపాల్ వర్మ చేయాలనుకున్న 'సావిత్రి' సినిమాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. ఆ సినిమా కొన్ని కారణాలు వల్ల విడుదలవ్వలేదు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో బూతు డైలాగులు ఉన్నాయని ఫోజులు కొడుతోంది.. అసలే ఆఫర్స్ లేని ఈ భామ ఇలా చేయడానికి కారణం ఓ బంపర్ ఆఫర్ తగలడమే అంటున్నారు.

ఇంతకీ ఆ ఆఫర్ ఏంటనే కదా మీ డవుట్? అదేంటంటే.. టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ బ్యాచులర్ జెడి చక్రవర్తి.. అనుకృతి శర్మని పెళ్లి చేసుకోబోతున్నాడట.. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకుందని చెబుతున్నారు.. జెడి కండీషన్ వల్లే ఈ సావిత్రి 'పాప' సినిమా నుంచి తప్పుకుందట. నిజానికి జెడి చక్రవర్తి ఈ అమ్మడిని పెళ్లి చేసుకునే అంత సీన్ ఉందా లేదా అనే మ్యాటర్ కంటే.. అసలు జెడి ఈ భామ పై మనసెలా పారేసుకున్నాడా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మొత్తానికి 'పాప' మూవీకి హ్యాండ్ ఇచ్చిన ఈ హాట్ పాప జెడి బ్యాచులర్ జీవితంలో అడుగు పెడుతుందని చెప్పుకుంటున్నారు.

English summary

J D Chakravarthy marriage with Anukriti Sharma