ఆ నలుగురు కోర్టుకు ఎందుకు హాజరవ్వలేదు!

Jabardasth anchors and judges not attended to the court

02:50 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Jabardasth anchors and judges not attended to the court

ఇటీవల హాస్యం పేరుతో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్న కార్యక్రమం 'జబర్దస్త్‌'. ఇందులో ఏదో ఒకసారి ఒకో వర్గాన్ని సెటైర్‌గా మారుస్తూ స్కిట్స్‌ చేస్తుంటారు టీమ్‌. అయితే ఇటీవలే న్యాయవాద వృత్తిని అగౌరవ పరిచేలా ఓ స్కిట్‌ వేశారన్న కారణంగా సదరు కార్యక్రమ టీం సభ్యులతో పాటు కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ టాలీవుడ్‌ నటులు నాగబాబు, రోజా, కార్యక్రమ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి, యాంకర్లు రష్మి, అనసూయ తదితరులైన మొత్తం 22 మందికి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: భారతదేశం నుండి అరిస్టాటిల్‌ ఈ ఐదింటిని తీసుకురమ్మన్నాడట ..

న్యాయవాది అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకే కోర్టు నోటీసులు అందుకున్న 'జబర్దస్త్‌' టీంలోని సభ్యుల్లో పచ్చ మధు, చమ్మక్‌ చంద్ర, రాకెట్‌ రాఘవ, షేకింగ్‌ శేషు, నాగేశ్వరరావు, ఫణి తదితరులు శుక్రవారం నాడు హుజురాబాద్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమ నిర్మాత అయిన శ్యాంప్రసాద్‌ రెడ్డితో పాటు న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా, యాంకర్లు రష్మీ, అనసూయలు మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. వీరి తరఫున న్యాయవాది హాజరు కాగా, తదుపరి విచారణను న్యాయమూర్తి జూన్‌ 30కి వాయిదా వేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: భార్య అక్ర‌మ సంబంధాన్ని టెక్నాల‌జీతో బయట పెట్టాడు

English summary

Jabardasth anchors and judges not attended to the court. Jabardasth anchors Anasuya, Rashmi and judges Naga Babu and Roja not attended to the court.