తెలుగు వారికి బాద్ షా బంపర్ ఆఫర్

Jabra FAN Anthem Song From FAN

09:49 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Jabra FAN Anthem Song From FAN

బాలీవుడ్ బాద్ షా షారూక్ తాజా చిత్రం ‘ఫ్యాన్’ థీమ్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తూ, సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 15న విడుదల కాబోతోంది. యశ్ రాజ్ ఫిల్స్మ్‌ షారూక్‌తో సినిమా చేసే ప్రతీసారీ సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌కు తెరతీయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా అదే పంథాలో ఈ బ్యానర్ పయనిస్తోంది. అందులో భాగంగానే జబ్రా ఫ్యాన్ థీమ్ సాంగ్‌ను ఆరు భాషల్లో విడుదల చేసి బాలీవుడ్‌తో పాటు మొత్తం సినీ ఇండస్ట్రీని ఆకర్షించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో హాట్ ఫేవరెట్‌గా మారింది. ఈ పాటను వివిధ భాషల్లో షారూక్ పలువురు ప్రముఖులకు అంటే, మహాత్మ గాంధీ, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులకు ఈ సాంగ్ అంకితమిచ్చాడు. ఇక తమిళ వెర్షన్‌ను రజనీకాంత్‌కు అంకితమిస్తున్నట్లు షారూక్ ప్రకటించడం మరో విశేషం. తమిళం, పంజాబీ, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, గుజరాతీ భాషల్లో విడుదలైన ఈ థీమ్ సాంగ్ కి అనూహ్య స్పందన లభిస్తోంది.

సినిమా రిలీజ్‌కు ముందే ఇంత హంగామా సృష్టిస్తోన్న ఈ మూవీ రిలీజైన తర్వాత ఇంకెన్ని సంచలనాలకు వేదికగా మారుతుందోనని సినీజనం చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు సాంగ్‌ కూడా రిలీజ్ చేస్తారట. అయితే ఇది ఏబీఎన్ ప్రేక్షకులకు మాత్రమే ప్రత్యేకం అవుతుందట.

English summary

King Khan Shah Rukh Khan's recent film was FAN .This movie was produced by yYash Choppra and this movie anhtem song was released in soo many languages,Now this Telugu version will be released on ly to ABN AUsers