భారత్ కి మార్షల్ ఆర్ట్స్ వీరుడు

Jackie Chan To Come India

11:10 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Jackie Chan To Come India

‘కుంగ్ ఫు యోగా’ షూటింగ్ కోసం మార్షల్ ఆర్ట్స్ వీరుడు జాకీ చాన్ భారత్ వస్తున్నాడు. ఇండో చైనీస్ సినిమా ‘కుంగ్ ఫు యోగా’లో జాకీ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా మార్చి 21న భారతదేశం వస్తున్నట్టు ప్రముఖ నటుడు సోను సూద్ వెల్లడించాడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ‘‘జాకీ చాన్‌తో కలిసి నటించడం తన కల. ‘కుంగ్ ఫు యోగ’ సినిమాతో ఆ కల నేరవేరింది. అంతేకాకుండా నేను కలిసి పనిచేసిన నటుల్లో జాకీచాన్ అత్యంత వినయం గలవారు’ అని కితాబిచ్చాడు. అమైరా దస్తూర్ మరో ముఖ్య పాత్రలో కనపడనున్న ఈ సినిమా షూటింగ్ జైపూర్‌లో 15 రోజుల పాటు జరుగనుంది. ఇండియా షెడ్యూల్ అనంతరం బీజింగ్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల చేస్తారు.

ఆ పార్టీ తరఫున పోటి చెయ్యనున్న విశాల్

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

English summary

Kung Fu Star and World Famous Hero Jackie chan to come to India for his upcoming film "Kung Fu Yoga" .This movie was going to be shoot in Jaipur for 15 days.This was said by Sonu Sood.