ఇంటివాడు కానున్న జడ్డు

Jadeja To Get Engaged

11:09 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Jadeja To Get Engaged

టీమిండియాలో పెళ్లిసందడి కొనసాగుతోంది. గతేడాది హర్భజన్‌సింగ్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌శర్మ తదితరులు పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఇక యువరాజ్ సింగ్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి కబురు వినిపించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఆ జాబితాలోకి ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా చేరాడు. రాజ్‌కోట్‌కు చెందిన ఇంజినీరింగ్‌ యువతి రీవా సోలంకితో శుక్రవారం జడేజా నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని అతని సోదరి నైనా జడేజా వెల్లడించారు. రాజ్‌కోట్‌లోని జడేజా సొంత రెస్టారెంట్‌లో ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లు హాజరుకానున్నట్టు తెలిసింది.

English summary

Indian cricket star all rounder Ravindra Jadeja to get engaged with Reeva solanki today.This was confirmed by Jadeja sirter and this event was going to be held in Jadeja's own hotel