మళ్లీ వస్తున్న 'జగదేకవీరుడు అతిలోకసుందరి'!!

Jagadeka Veerudu Athiloka Sundari special show

01:50 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Jagadeka Veerudu Athiloka Sundari special show

మెగాస్టార్‌ చిరంజీవి, అందాల నటి శ్రీదేవి కలిసి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. ఈ చిత్రం వచ్చి ఇప్పటికి 26 సంవత్సరాలు పూర్తయింది. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం మళ్లీ వెండి తెరపైకి రాబోతుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఏంటి ఎప్పటిదో మళ్లీ విడుదల చెయ్యడమేంటి అనుకుంటున్నారా? కంగారు పడకండి అసలు విషయమేమిటంటే, కొంత మంది అభిమానులు కోరిక మేరకు మరియు క్యాన్సర్‌ పేషంట్లకి సాయం చేయడం కోసం ఈ సినిమాని మళ్లీ విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌ లోని గచిబౌలి స్టేడియంలో 'స్కై ఫెస్ట్‌' జరగబోతుంది. ఈ ఫెస్ట్‌లో కె. రాఘవేంద్రరావు చేతుల మీదగా విడుదల చేయబోతున్నారు. అదీ సంగతి.

English summary

Jagadeka Veerudu Athiloka Sundari special show in Gachibowli Stadium.