అంతా చంద్రబాబే చేశాడన్న జగన్!

Jagan comments on Chandrababu

12:23 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Jagan comments on Chandrababu

కృష్ణ పుష్కరాల సందడి సాగుతుంటే, ఓ పక్క ప్రముఖుల ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. అయితే మరోపక్క విమర్శలు చెలరేగుతున్నాయి. అధికారంలోకి వచ్చిననాటి నుంచి నేటివరకూ చంద్రబాబు చాలా తప్పులు చేశారని ఆలిస్ట్ వంద వరకూ చేరిపోతుందని ఆయన ఏపీ పాలిట శిశుపాలుడని వైకాపా అధినేత జగన్ ధ్వజమెత్తారు. వందతప్పులు చేస్తున్న చంద్రబాబు పాపాలను దేవుడు క్షమించడని జగన్ పేర్కొన్నారు. పుష్కర స్నానం చేస్తూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. ఏటూరు పుష్కర ఘాట్ ప్రాంతంలో స్నానాలకు వెళ్లిన విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించి, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

తాను వస్తున్నాననే విషయం తెలిసి హడావుడిగా రూ. 3 లక్షల పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చిన ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని.. గోదావరి పుష్కరాల సందర్భంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ఇచ్చినట్లుగానే వీరికి కూడా రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించిన వైకాపా అధినేత.. విద్యార్థుల మరణాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఏటూరు పుష్కరఘాట్ కు ఇదే దారి అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన చోటే విద్యార్థులు పుష్కర స్నాన్నాలకు వెళ్లి చనిపోతే, వీరంతా ఈతకు వెళ్లి చనిపోయారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

పుష్కరాల్లో స్నానాలు చేయకపోతే పాపాత్ములన్న రీతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టారని చెప్పిన జగన్.. ఈ మరణాలకు చంద్రబాబు సర్కారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజూ ఆహార పొట్లాలు కూడా అందిస్తున్న ఈ పుష్కర ఘాట్ వద్ద ఎందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని జగన్ ప్రశ్నించారు.

English summary

Jagan comments on Chandrababu