టాలీవుడ్ మన్మధునికి సీటు ఆఫర్ చేసిన జగన్

Jagan Confirms Seat For Nagarjuna

04:48 PM ON 23rd December, 2016 By Mirchi Vilas

Jagan Confirms Seat For Nagarjuna

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పైగా ఇప్పటి పరిస్థితుల్లో ఎత్తుకుపై ఎత్తు వేసే ఓర్పు నేర్పు ఉండాలి. చొచ్చుకుపోవాలి. ఇక ఏపీ పాలిటిక్స్‌లో కొద్ది రోజులుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ రికవరీ పేరుతో పలు అంశాలలో చాకచక్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా కీలక జిల్లాలకు చెందిన పలువురు నాయకులను తన పార్టీలో చేర్చుకుంటూ 2019 వార్‌కు జోరుగా దూసుకెళుతోన్న జగన్ తాజాగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జునపై కూడా వలవేసినట్టు జోరుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే నాగ్ సైతం జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగానే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి నాగార్జునకు మంచి రిలేషన్ ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలకు నాగార్జున ఫ్రీ ప్రచారం కూడా చేసిపెట్టారు.

అదీగాక వైఎస్‌తో పాటు జగన్‌కు అత్యంత సన్నిహితులైన వారితోనే నాగార్జున బిజినెస్‌లు కంటిన్యూ చేస్తున్నాడు. దీనికి తోడు నాగ్ రెండో కుమారుడు అఖిల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనుమరాలు శ్రియా భూపాల్‌ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. దీంతో నాగ్ – జగన్ మరింత దగ్గర బంధువులు కానున్నారు.

ఈ క్రమంలోనే నాగ్‌ను వైసీపీలోకి రమ్మని ప్రెజర్ చేస్తోన్న జగన్ రాజధాని ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు లోక్‌సభ సీటును నాగార్జునకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నాగ్ గుంటూరు నుంచి గెలిస్తే కీలకమైన రాజధాని ప్రాంతంలో పాపులర్ అవ్వడంతో పాటు ఇక్కడ తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కూడా అనువుగా ఉంటుందని భావిస్తున్నాడట. మొత్తానికి 2019 నాటికి ఎవరి ఎత్తుగడల్లో వారు మునిగి తేలుతూ, పావులు కదుపుతున్నారు. అయితే ఆసమయానికి ఈ ఈక్వెషన్లు ఎలా మారతాయో చూడాలి.

ఇది కూడా చూడండి: ఈ ఐదూ ఉంటే ఆనందం మీవెంటే .. అవేమిటో తెలుసా?

ఇది కూడా చూడండి: వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఇది కూడా చూడండి: మగవారు ఈ 4 విషయాలు ఎప్పటికీ ఇతరులతో పంచుకోకూడదట!

English summary

Jagan Confirms Seat For Nagarjuna