జగన్ దెబ్బకు పవన్ మూవీకి బ్రేకు?

Jagan Effect On Pawan Dasari Movie

10:16 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Jagan Effect On Pawan Dasari Movie

అవునో,కాదో గానీ ఈ విషయమై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే వీటికి కారణాలు కూడా చూపిస్తున్న నేపధ్యంలో నిజమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమంటే, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో దాసరి నారాయణరావు ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చేశారు. అందుకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు ప్రచారం సాగింది. అభిమానులు ఎప్పుడెప్పుడు అని భావిస్తున్న తరుణంలో ఓ కొత్త విషయం రివీల్ అయ్యింది. జగన్ కారణంగానే ఈ సినిమా కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిందనేది ఫిల్మ్‌ సర్కిల్స్‌ రూమర్. ఇంతకీ జగన్ వల్ల ఎందుకు ఆగింది? తుని కాపు గర్జన ఘటనకు ముందు జగన్ వెళ్లి దాసరిని ఆయన ఇంట్లో కలిశారు.

ఇవి కూడా చదవండి:చిరు 150వ చిత్రం హిట్ అవ్వాలని పూజలు చేస్తున్న ఉపాసన

దీంతో జగన్‌కు బ్యాక్ సపోర్ట్‌గా దాసరి వున్నాడంటూ ఏవేవో వార్తలొచ్చాయి. అయితే, ఈ నేతలిద్దరి మధ్య భేటీలో ఏం జరిగిందో తెలీదుగానీ అప్పటినుంచి పవన్ - దాసరి ప్రాజెక్ట్ స్లో అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ స్విచ్ నొక్కారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. రీసెంట్‌గా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజ్‌కు ముందు దాసరితో తాను ప్రాజెక్ట్ చేస్తున్నానంటూ పవన్ మనసులోని మాటను బయటపెట్టాడు. త్వరలోనే ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని అనుకున్నారు. ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ఊసేలేదు. మరోవైపు ఈ రూమర్లను దాసరి వర్గీయులు తోసిపుచ్చుతున్నారు. అదంతా వుట్టిదేనని రాజకీయాలు రాజకీయాలే.. సినిమాలు సినిమాలేనని, వాస్తవానికి పవన్ అంటే దాసరి కి బోల్డంత ఇష్టమని అంటున్నారు. మరి నిజం ఏమిటన్నది త్వరలో తేలుతుంది.

ఇవి కూడా చదవండి:పవన్ ని చీల్చి చెండాడేసిన వర్మ

చిరు సినిమా స్టోరీ నాదేనంటున్న రైటర్

English summary

Previously Pawan Kalyan and Dasari Narayana Rao said that They were going to Do a Movie . But That Movie was not gone to the sets till now. Now A Rumor came to know that this movie was stopped because of Y.S.Jagan.