కాల్ మనీతో రాష్ట్రానికి చెడ్డ పేరంటున్న జగన్ 

Jagan Fires On Call Money Case

01:04 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Jagan Fires On Call Money Case

కాల్ మనీ వ్యవహారంతో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని వైసిపి అధినేత వైఎస్ జగన్ అంటున్నారు. పార్టీ ఎంఎల్ఎ లతో కల్సి మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్ ని కలుసుకున్నారు. కాల్ మనీ , బాక్సైట్ గనుల తవ్వకం తదితర అంశాలపై ఆయన గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటామని గవర్నర్ అన్నారు.

విజయవాడ - గుంటూరు లను మాఫీయా గా మార్చారని , సిఎమ్ చంద్రబాబే మాఫీయాను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు గవర్నర్ ని కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ . టిడిపి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నారని , తమ పార్టీ ఎంపి ఎం ఎల్ ఎ లపై లేనిపోని కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

బాక్సైట్ విషయంలో గిరిజన సలహా బోర్డ్ ఏర్పాటుచేయడం లేదని , 7గురు గిరిజన ఎం ఎల్ ఎ లలో ఆరుగురు వైసిపికి చెందిన వారవ్వడం వల్లనే బోర్డ్ వేయడంలేదని జగన్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన గిరిజన ఎం ఎల్ ఎ ఈశ్వరి పై హత్య కేసు పెట్టారని ఆయన వాపోయారు.

English summary

Ysrcp party president T.S.Jagan Mohan Reddy complaints to governer Narasimhan about call money,bauxite case that had bee occuring in Andhrapradesh