యంగ్ టైగర్ కి జగన్ హెల్ప్ !

Jagan Helped For Junior NTR Movie

11:14 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Jagan Helped For Junior NTR Movie

కొన్ని కొన్ని అనుకోకుండా జరిగే పనులు ఎదుటివారికి బెనిఫిట్ అవుతుందని అంటారు. లేకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జగన్ హెల్ప్ చేయడం ఏమిటి? కానీ ఇది కూడా ఓ చర్చ అయింది. ఎందుకంటే, జగన్ వస్తు రూపేణా, ధన రూపేణా జూనియర్ ఎన్టీఆర్ కు సహాయం చేయలేదు. అయితే, బంద్ రూపంలో సహకరించారట. జగన్ బంద్ ప్రకటిస్తే జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన లాభమేంటనే అనుమానం రావడం కూడా సహజమే. వివరాల్లోకి వెళ్తే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు అన్ని పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే బంద్ రోజు అన్నీ మూతపడతాయి. అత్యవసర సేవలు, థియేటర్లు తప్ప.

బంద్ కారణంగా ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఖాళీగా ఉన్నారు. ఈ అంశమే జూనియర్ ఎన్టీఆర్ కి వరంగా మారిందట. అదేనండి, జూనియర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాకు కలిసొచ్చింది. బంద్ కావడంతో ఉద్యోగులంతా పిల్లాపాపలతో సహా థియేటర్లకు క్యూ కట్టారు. జనతాగ్యారేజ్ థియేటర్లన్నీ కళకళలాడాయి. ఇలా జగన్ పిలుపునిచ్చిన బంద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు బాగా కలిసొచ్చిందని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు. ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జనతాగ్యారేజ్ కి బంద్ నాటి ఒక్కరోజు కలెక్షన్లతో మరింత పుంజుకుందని అంచనా వేస్తున్నారు. ఇక పెద్ద సినిమాలేవి లేకపోవడంతో అందరూ జనతాగ్యారేజ్ వైపే అడుగులేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదండీ ఆవిధంగా జూనియర్ కి జగన్ ఆవిధంగా సాయపడ్డారట.

ఇవి కూడా చదవండి:వశిష్టి దేవిగా శ్రేయ అదిరింది

ఇవి కూడా చదవండి:ప్రపంచంలో టాప్ 10 అందగత్తెలు వీరే!

English summary

Junior NTR's Janata Garage movie was going with good talk and superb collections at the box office. Recently the collections of this movie was become dull but due to the strike of YSR Congress Party people enjoyed by going to Janata Garage and that day the movie collections were increased due to state wide strike and this is the way Jagan Helped Junior NTR.