జగన్ ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం!..?

Jagan Illegal Assets Were Ready To Seize Says Yanamala

01:26 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Jagan Illegal Assets Were Ready To Seize Says Yanamala

అధికార పక్షంపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ పై ఓ పక్క ఎదురు దాడి చేస్తున్న అధికార పక్షం మరోపక్క జగన్ని అన్నిరాకాలుగా వీక్ చేయడానికి వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కాకినాడలో జరిగిన ఓ సభలో ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో సాక్షి టీవీ చానెల్, పత్రికను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలవుతుందన్నారు. అక్రమాస్తుల కేసులో అటాచ్ అయిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.

స్పెషల్ కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్నారు. అవినీతి కేసుల్లో రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థల ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా జప్తు చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేందుకు స్పెషల్ కోర్టుల చట్టం ద్వారా అధికారం ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీ గత సెప్టెంబరులో జరిగిన సమావేశాల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. కాగా 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ పై గల 11 చార్జ్ షీట్ల నేపథ్యంలో సీబీఐ, ఈడీ కూడా ఆయనకు చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. అయితే ఆస్తుల స్వాధీనం గురించి వైసిపి పెదవి విరుస్తోంది. చేసుకోమనండి చూద్దాం అంటోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: చేతిలో పురుగుల మందు డబ్బా .. పోలీసులకు హెచ్చరిక(వీడియో)

ఇవి కూడా చదవండి:వైఎస్ దేవుడు... నేను రాక్షసుడినా?

English summary

Andhra Pradesh Finance Minister said in a meeting that Government was ready to seize Ysrcp President Y.S.Jagan Illegal Assets and Sakshi News Paper and Sakhsi News Channel.