జగన్ సినిమాకు దర్శకరత్న డైరెక్షన్ ...

Jagan Meets Dasari Narayana Rao

01:21 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Jagan Meets Dasari Narayana Rao

శత చిత్రాలకు పైగా దర్సకత్వం వహించిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు ఇప్పుడు జగన్ శిబిరానికి చేరువవుతారా... కొత్త సమీకరణాలకు తెరలేపుతారా... అవుననే దిశగా పరిస్థితులు కానవస్తున్నాయి. గడిచిన ఎన్నికల్లో అధికారం కోసం సాగిన పోరాటంలో 1 శాతం ఓట్ల తేడాతో కుర్చీ చేజారిపోయిన వైసిపి అధినేత జగన్ తాజాగా దర్శకరత్న ను కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.

కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించి , కేంద్రంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసి , బొగ్గు గనుల కేటాయింపుల వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ దాసరి తానూ నిర్దోషినని పదేపదే చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ కి కూడా దూరంగానే వుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరమీదికి రావడం , కమీషన్ వేయడం , మరోపక్క కాపు నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భారీ సభకు ప్లాన్ చేయడం వంటి పరిణామాల నేపధ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దాసరిని జగన్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మామూలుగా అయితే మెగాస్టార్ ఫ్యామిలీ డాక్టర్ దాసరికి నడుమ ఇటీవల కాలంలో పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అందుకు వ్యతిరేకంగా సినీమా తీసిన డాక్టర్ దాసరికి, ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం , కేంద్రంలో మంత్రి అయిపోవడం మింగుడు పడలేదు. దీనికి తోడూ సినీమా రంగంలో కూడా చిరు తనయుడు చరణ్ - డాక్టర్ దాసరి నడుమ మాటల యుద్ధం సాగడం తెల్సిందే.

మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో సీన్ లేకపోవడం , చిరంజీవి సైలెంట్ అయిపోయి , సినీమాల పై దృష్టి పెట్టడం, మరో పక్క చిరు బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా టిడిపి కొమ్ము కాయడం వంటి పరిణామాలను గమనిస్తున్న దాసరి అదను కోసం చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వైఎస్ జగన్ హఠాత్తుగా దాసరితో సమావేశం కావడం వెనుక ఓట్ల లాజిక్కు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎత్తుగడలో భాగంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ లోని దాసరి నివాసానికి స్వయంగా వెళ్లిన జగన్ దర్శకరత్నతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. జగన్ వెంట తిరుపతి మాజీ ఎంఎల్ఎ భూమన కరుణాకర్ రెడ్డి వున్నారు. భేటీ అనంతరం దాసరి నారాయణరావు తమది మర్యాదపూర్వక సమావేశమని చెప్తూనే సమావేశ ఆంతర్యాన్ని బయట పెట్టాకనే పెట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని ఆయన అంటూ , వైఎస్ కుమారుడు అయిన జగన్ ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ , ఇప్పటికే మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని కితాబిస్తూ , అతనికి తన దీవెనలు ఎప్పుడు ఉంటాయన్నారు. ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తునట్లు చెప్పారు. మరి దర్శక రత్న జగన్ వెంట నడిచి , ఆపార్టీకి దిశా నిర్దేశం చేస్తారో , లేకపోతే జగన్ కు సినీమా చూపిస్తారో వేచి చూడాలి.

English summary

Ysr Congress President Y.s.Jagan meets Director , Ex- Minister Dasari Narayana Rao. Dadari says thay he has good relations with YS family and he praised Y.s.Jagan on his political carrier