ఇంతకీ జగన్ గురి ఎవరిపై

Jagan Mohan Reddy playing Golf

04:35 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Jagan Mohan Reddy playing Golf

మనం చూస్తున్న ఈ పిక్ లో గోల్ఫ్ ఆడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలే రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. 20 మంది పార్టీ ఎంఎల్ఏలు గోడదూకి, టిడిపిలోకి వెళ్లిపోయారు. ఇంకా చాలామంది సైకిలు ఎక్కేందుకు సిద్ధంగా వున్నారని వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో గోల్ఫ్ ఆడేంత తీరిక ఎక్కడిదా అనుకుంటున్నారా? క్రికెటర్లు, సినిమా వాళ్లే కాదు, ఇంకా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఏం చేస్తున్నారేమో వేయి కళ్ళు గమనిస్తూ ఉంటాయి.

అందుకే ఆమధ్య నారా లోకేష్ గోవాలో చేసిన ముచ్చట్లు వెలుగు చూశాయి. అలాగే పలువురు నేతల విషయాలు కూడా వెలుగు చూశాయి. అదేవిధంగా జగన్ ఇటీవల లండన్ వెళ్ళినపుడు ఆడిన గోల్ఫ్ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పదిరోజుల పాటు లండన్ పర్యటన చేస్తున్న జగన్ ఫోటోలు ఎవరు తీసి వుంటారు, ఇంకా ఏమైనా ఫొటోలు ఉన్నాయా అనేది తేలాలి. కాగా సాధారణంగా విదేశాల్లో ఇలాంటి ఫోటోలు తీయనివ్వరని కానీ ఎలా వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ మాజాకా అంటున్నారు కూడా. కాగా జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఇద్దరు కుమార్తెలు ఈ పర్యటనలో ఉన్నారు.

దాదాపు 10 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఏడురోజుల పాటు యూకేలో గడిపిన జగన్ మరో మూడు రోజులు ఐర్లాండ్, స్కాట్లాండ్ లో గడపనున్నారు. అనంతరం జగన్ హైదరాబాద్ కు చేరుకుంటారు. మొత్తానికి హాట్ హాట్ రాజకీయాల నుంచి ఉపశమనం కోసం ఈ ట్రిప్ వేసుకున్ననట్లు ఉందని అంటున్నారు.

English summary

Jagan Mohan Reddy playing Golf